ఏపీలో ఎన్నికల సందర్భంగా ప్రచారం విపక్షాల మధ్య హోరెత్తింది. ప్రచారాన్ని ఇరువర్గాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో జబర్దస్త్ నటులపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఒకవైపు మీడియాలోనూ, మరోవైపు సోషల్ మీడియాలో కూడా పెను దుమారం సృష్టించాయి. అయితే దానికి అంతే ఘాటు బదులిచ్చారు కిరాక్ ఆర్పీ. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తదితరులు ప్రచారం ఎంత పెద్ద ఎత్తున చేసారో తెలియంది కాదు. ఈ సందర్భంగా వారు చిన్న నటులు , చిన్న ప్రాణాలని రోజా మాట్లాడడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయి.

అక్కడితో ఆగకుండా ఆమె మెగా ఫ్యామిలీ ఆగ్రహానికి గురైతే ఇండస్ట్రీలో మనుగడ కష్టం అని వారు భయపడుతున్నారని.. అందుకే పవన్ కోసం ప్రచారం చేస్తున్నారని రోజా ఆరోపించడం వారిని బాధించింది. కాగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిరాక్ ఆర్పీ తనదైన రీతిలో స్పందించారు. వాళ్లంతా చిన్న ఆర్టిస్టులైతే .. రోజాకు 15 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులేమైనా వచ్చాయా అని ప్రశ్నించారు. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను వేసే క్యారెక్టర్లు నీ జీవితంలో ఒక్కటైనా వేయగలవా? అంటూ ప్రశ్నించాడు. రాష్ట్రంలో అందరికంటే ముందు ఓడిపోయేది రోజాయేనని, ఆమెకు డిపాజిట్లు కూడా రావన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆర్పీ.. లైవ్‌లోనే రోజాను ఓ రేంజ్‌లో ఏసుకున్నాడు. ఈ వేదికగా గతంలో ఆమెకు జరిగిన పుష్పాభిషేకంపై ఛలోక్తులు విసిరాడు. రోజా ఏం సాధించిందని పూలతో అభిషేకం చేస్తున్నారు.. మీకు బుద్ధి ఉందా? అంటూ అక్కడి జనాలను ఓ ఆట ఆదుకున్నాడు. ఈ క్రమంలో రోజాపై పూల వర్షం కురిపిస్తున్న వ్యక్తికి ఆమె పీఏ లక్షన్నర ఇచ్చి ఉంటాడేమోనని అనుమానం వ్యక్తం చేసాడు. దాంతో ప్రస్తుతం రోజాపై పూల వర్షం , దానికి కిరాక్ ఆర్పీ విశ్లేషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా రోజాపై పుష్పాభిషేకం చేసిన వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: