ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయి 10 సంవత్సరాలు అయినా ఆంధ్రప్రదేశ్ లో గత పదేళ్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ది జరగలేదనే విమర్శ ఉంది. ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే ఏపీకి ఈ పరిస్థితి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇప్పటికే ఈ పరిస్థితి మారి ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ప్ర‌త్యేక హోదా లేకపోవడమే ఏపీ పాలిట శాపమని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. 2014లోనే ఇచ్చిన హామీల ప్రకారం ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఇప్పటికే పదుల సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉండేవి. ఏపీ యువత భవిష్యత్తు బంగారమయ్యేది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ల రూపంలో ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వడం, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు అందించడం చేస్తుంది.
 
ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీలు, రుణాల చెల్లింపు వాయిదాల ద్వారా రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉందో ఆ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని అని చెప్పవచ్చు. ప్రణాళికా సంఘం సూచనల ఆధారంగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక బెనిఫిట్స్ లభించే అవకాశాలు అయితే ఉంటాయి.
 
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఎంతో కష్టపడినా కేంద్రం నుంచి సానుకూల ఫలితాలు రాలేదు. వెనుకబాటు వల్ల ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడం జరుగుతుంది. ప్రత్యేక హోదా భవిష్యత్తులోనైనా వస్తే ఏపీ ముఖచిత్రం మారే అవకాశాలు అయితే ఉంటాయి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏపీలో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. జగన్ ఇప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో నమ్మకంతో ఉన్నారు. ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల ఏపీ పదేళ్లు వెనుకబడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: