మే 13వ తేదీన ఎన్నికల ముగిసాయి. అభ్యర్థుల భవితవ్యం మొత్తం  ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఎవరు బయటపడతారు ఎవరు ఇంట్లో కూర్చుంటారు అనేది జూన్ 4వ తేదీన తేటతెల్లమవుతుంది. అలాంటి ఈ తరుణంలో  175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉత్కంఠనే ఉంది. ఇక అభ్యర్థుల కంటే ప్రజలకే మరింత ఉత్కంఠ నెలకొని ఉంది. అలాంటి ఈ తరుణంలో ఎన్నో సర్వేలు చేసి రెండు పార్టీలు చాలా బలంగానే ఉన్నాయని హోరాహోరీగా ఓటింగ్ జరిగిందని చెబుతున్నాయి. కానీ ఎవరు గెలుస్తారనేది గట్టిగా ఏవరు చెప్పలేకపోతున్నారు. 

కానీ జగన్ మాత్రం నేనే మరోసారి సీఎం అవుతానని గట్టిగా బల్లగుద్ది మరి చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులే అని చెప్పవచ్చు. ఆంధ్ర రాజకీయ చరిత్ర చూసుకుంటే  ఇప్పటివరకు జగన్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏ సీఎం తీసుకురాలేదు. పథకాలు తీసుకురావడమే కాదు, ఇంటికి వెళ్లి మరి ఆ పథకాలను అమలు చేయించే పని  ప్రభుత్వ హయాంలో ఉండే వ్యక్తులు చూసుకోవడం  ప్రజలకు మరింత మేలు కలిగే విషయం అని చెప్పవచ్చు. మూలన ఉండే ముసలమ్మలకు కూడా  ఇంటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్ ఇచ్చి ఆమె కళ్ళల్లో ఆనందం చూశారు. మొత్తం భారతదేశంలోని ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు. "అన్నం వండి ప్లేట్లో పెట్టి కలిపి మరి నోట్లో పెట్టాడు జగన్". అంత మంచి పని చేసినటువంటి వ్యక్తిని  ఎలా మరుస్తారు.

 ఎందుకంటే ఏపీ ప్రజలు ఇప్పటికే మూడు, నాలుగు పార్టీల పాలనలు చూశారు. ఏ పార్టీ పాలన చేసినా ప్రజల దగ్గరికి పథకాలు వెళ్లడం ఎక్కడ చూడలేదు ఎప్పుడూ చూడలేదు.  కానీ జగన్ మాత్రం కొత్తగా చూపించాడని మాకు జగన్ అయితేనే మళ్ళీ ఈ పథకాలను ఉంటాయని చాలామంది గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారట. చంద్రబాబు పాలన ఇదివరకే చూశారు. కానీ ఆయన హయాంలో ఇలాంటి పనులు ఏమి జరగలేదు. కాబట్టి జగను మరియు చంద్రబాబును పోల్చి చూసి  మనకు మళ్లీ జగన్ సీఎం అయితేనే బాగుంటుందని  చాలామంది మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు  ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి జగనే మళ్ళీ సీఎం కావాలని వారు కోరుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: