•పోల "వరమా" శాపమా.?
- పనులు ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి.!
- ఈ జనరేషన్ వాళ్లు పోలవరం చూడడం సాధ్యమేనా.?


 పోలవరం ప్రాజెక్ట్ ఎన్నో ఏళ్ల నాటి కళ. ఈ ప్రాజెక్టు పేరుతో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అలాంటి పోలవరం మన తాతయ్యల చిన్నతనంలో మొదలైంది. కానీ ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు కంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాల్లో మొదలెట్టారు పూర్తి చేశారు.  అయినా పోలవరం పనులు మాత్రం ఒక అడుగు ముందుకేస్తే మరో నాలుగు అడుగులు వెనక్కి అనే విధంగా తయారయ్యాయి. మరి పోలవరం ప్రజలకు వరంగా నిలుస్తుందా లేదంటే  శాపం అవుతుందా.. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రులు కన్నీరు  పెట్టాల్సిందేనా.. ప్రభుత్వాలు మారుతున్నా పనుల్లో మాత్రం మార్పు లేదు. అలాంటి పోలవరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

 ప్రారంభం :
 ఈ పోలవరం ప్రాజెక్టుకు 1946-47లో రూపకల్పన చేశారు. అప్పట్లోనే ఇది 129 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. తర్వాత ఈ ప్రాజెక్టును 1980లో అప్పటి సీఎం టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేశారు. కానీ అప్పటి నుంచి పనులు మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగడుగు వెనక్కి అనే విధంగా తయారవుతూ వస్తోంది. ఆయన తర్వాత ఎంతోమంది సీఎంలు వచ్చారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి.  అయినా ప్రాజెక్టు పనుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఈ ప్రాజెక్టును పోలవరం మండలం రామయ్యపేట గ్రామ సమీపాన గోదావరి నదిపై నిర్మించనున్నారు.  దీన్ని రాజమండ్రి కొవ్వూరు రోడ్డు రైలు వంతెనకు 34 కిలోమీటర్లు ఎగువన ఉన్నది. ఇది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తూర్పు కనుమలు అలాగే మైదానంలోకి ప్రవేశిస్తుంది.  ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే..దీని ద్వారా 4, 36,825 హెక్టార్ల  నీటిపారుదల సామర్థ్యం కలిగి ఉంటుంది.  అలాగే ఈ ప్రాజెక్టు 960 మెగావాట్ల జల విద్యుత్ ఎన్నో గ్రామాలకు తాగునీరు, వ్యవసాయానికి సంబంధించిన నీరు అందుతుంది.

 ప్రాజెక్టు పనులు:
 80 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తికాకపోవడం  చాలా బాధాకరం. దీని కంటే ఎక్కువ బడ్జెట్ సైజులో పెద్దదైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి చేశారు. కేవలం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. అలాంటిది పోలవరం ఎందుకు పూర్తి అవ్వడం లేదని ఏపీ ప్రజలే చర్చించుకుంటున్నారు.  

 ప్రాజెక్ట్ డిజైన్:
ఈ ప్రాజెక్టులో మూడు కీలక నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మెయిన్ డ్యాం. ఇది నదికి కుడివైపున ఉన్న కొండల్ని తీసివేసి మరి కడతారు. ఇది 1.8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం 48 గేట్లు ఉంటాయి. రెండవది ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్. ఇది వరదలు వచ్చినప్పుడు నీటిని అడ్డుకుంటుంది. దీని పొడవు వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంటుంది. మూడవది కెనాల్స్. ఇది పూర్తయిన తర్వాత డ్యామ్ కి కుడి ఎడమ వైపున   కెనాల్స్ తవ్వుతారు. 174 కిలోమీటర్లు ఉండే కుడివైపు కెనాల్  గోదావరి నీటిని కృష్ణ నదిలో కలుపుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ లో ఉన్న కెనాల్ 188 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది నీటిని విశాఖపట్నం వరకు తీసుకెళ్తుంది.  


 కానీ ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టులో  ఈ పనులేవి పూర్తిస్థాయిలో పూర్తవలేదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఈజీ పని కాదు. లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది. అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసే స్థలంలో పూర్తిస్థాయిలో ఇసుక మేటలు ఉంటాయి. ఈ ఇసుక మొత్తం తీసేసి  గట్టినేలా తగిలే దాకా తవ్వకాలు జరపాలి. అక్కడి నుంచి నిర్మాణాలు మొదలుపెట్టాలి. ఈ విధంగా ప్రాజెక్టుకు బడ్జెట్ ప్రాబ్లం తో పాటు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయినా జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు ఓ మోస్తారుగా పూర్తయ్యాయి.మరి చూడాలి నెక్స్ట్ ఏర్పడే ప్రభుత్వమైనా పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెడుతుందా లేదంటే మాకెందుకులే అని వదిలేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: