రాజకీయాలు, సినిమాలు ఈ రెండు వేర్వేరు రంగాలు కాగా ఈ రెండు రంగాలలో సక్సెస్ సాధించిన మహానుభావులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి తారక రామారావు అనే పేరు ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఇలాంటి గొప్ప నటుడు, మహానేత మళ్లీ పుడతారా? అంటూ సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు చాలా సందర్భాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.
 
సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఏకంగా ఏకంగా 93 మంది డైరెక్టర్లతో పని చేయడం గమనార్హం. ఈ డైరెక్టర్లలో ఎంతోమంది కొత్త దర్శకులు సైతం ఉన్నారు. ఇంతమంది దర్శకులకు ఛాన్స్ ఇచ్చారంటే సీనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో 17 సినిమాలు చేశారు. ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.
 
నేడు ఆయన 101వ పుట్టినరోజు కాగా మరో 100 సంవత్సరాలు గడిచినా ఆయన కీర్తిప్రతిష్టలు మాత్రం మసకబారవని చెప్పవచ్చు. సీఎం అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో కేంద్రం భారతరత్నను ప్రకటించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి సినిమా ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు.
 
పల్లెటూరులో జన్మించి పాలు అమ్మి ఎన్నో కష్టాలను అనుభవించి సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా సీనియర్ ఎన్టీఆర్ గుర్తింపును సంపాదించుకోవడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ వారసుడు బాలయ్య సైతం ఆయన నట వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతోంది.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: