సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అధికారి గతంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పవన్ వైజాగ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీని తరువాత జనసేన పార్టీ నుంచి లక్ష్మీనారాయణ బయటికి వచ్చేసారు.

చివరికి తన సొంతంగా జై భారత్ పార్టీని ప్రారంభించాడు, ఆ పార్టీ టికెట్ మీదనే లక్ష్మీనారాయణ 2024 ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నిలబడ్డారు. తాజాగా ఆయన తన మాజీ పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంపై పోస్ట్ పోల్ విశ్లేషణను జేడీ లక్ష్మీనారాయణ పంచుకున్నారు.

“నాకు తెలిసినంత వరకు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు లాక్ అయిపోయింది. ఆయన విన్నింగ్ జస్ట్ లోడింగ్. పవన్ ఎంత మెజారిటీతో గెలుస్తారనే దానిపై మాత్రమే చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వెళ్లే అర్హత ఉన్న పవన్‌కి ఇది బాగా కలిసిచ్చే ఎన్నికలు అని చెప్పగలను." లక్ష్మీనారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 2019లో జనసేన పార్టీని వీడిన తర్వాత లక్ష్మీనారాయణ పవన్ పై ఘాటుగా విమర్శలు చేశారు. పవన్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన వెంట నడవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని జేడీ ఎద్దేవా చేస్తుండేవారు. ఇప్పుడు కట్ చేస్తే, తిట్టిన నోటితోనే పవన్ కళ్యాణ్ ను పొగుడుతున్నారు. పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయం అంటూ మాట్లాడుతున్నారు. పవన్ భారీ మెజారిటీతో గెలుస్తారని నమ్మకం బాగా ఉందని పేర్కొన్నారు.

లక్ష్మీనారాయణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక పవన్ తో పాటు లోకేష్ కూడా ఈసారి గెలవబోతున్నారంటూ మరికొంతమంది అంచనాలు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పవన్ గెలిచే అవకాశం లేదని, ఆయన జాతకంలో రాజయోగం లేదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో లాగా అంచనాలు వేస్తుంటే అభిమానులు చాలా గందరగోళంగా ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: