ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి కేసులో నిందితుడుగా సతీష్ ను పోలీసులు సైతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిన్నటి రోజున సాయంత్రం విజయవాడలో 8వ అదనపు జిల్లా కోర్టు బెల్ కూడా మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలు రకాల షరతులను కూడా విధించారట. ప్రతి శనివారం ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి కచ్చితంగా అక్కడ సంతకాలను చేయాలంటూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అలాగే 50 వేల రూపాయలు ఇద్దరు షూరిటీలను కూడా ఇవ్వాలని తెలియజేసిందట.

ఎప్పుడూ కూడా ఊరు వదిలి వెళ్ళిపోకూడదని పోలీసులు విచారణకి ఎప్పుడు సహకరిస్తూ ఉండాలని ఆదేశాలను కూడా జారీ చేశారట కోర్టు. గత నెల 13వ తేదీన విజయవాడలో జగన్ పైన రాయి అటాక్ జరగడం జరిగింది. విజయవాడలో మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్ర లో భాగంగా జగన్ చేస్తున్న సమయంలో జగన్ పైన రాయి విసరడంతో ఆయన కనుబొమ్మ పై భాగంలో అది తగిలింది. దీంతో కంటి పైన గాయం కావడంతో హుటాహుటిగా వెంటనే అక్కడి నేతలు ఆసుపత్రికి తరలించారు.


అనంతరం చికిత్స చేయించిన తర్వాత గాయమైన చోట్ల కుట్లు కూడా పడ్డాయి. ఇదే సంఘటనలో ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయమైనట్టుగా తెలిసింది. ఈ కేసులో నిందితుడిగా సతీష్ ను సైతం అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. ముఖ్యంగా ఈ రాయి ఘటన వెనుక ఎవరైనా పెద్దలు హస్తం ఉందా అనే విషయం పైన దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం నెల్లూరు జైలులో సతీష్ రిమాండ్ ఖైదీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రాయి దాడి కేసులో సతీష్ కు బయలు రావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన లాయర్ సలీం ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ కేసుని ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: