ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... 175 అసెంబ్లీ అలాగే పార్లమెంటు స్థానాలకు ఇటీవల ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు కోసం... ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఏ పార్టీకి గెలుస్తుంది... అనే దానిపై బెట్టింగులు కూడా జోరుగా కాస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సోషల్ మీడియా పోస్టు... హాట్ టాపిక్ గా మారింది.


మంగళవారం రోజున సీనియర్ ఎన్టీఆర్ 101 వ జయంతి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్.. సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో తెలుగుదేశం పార్టీలో కొత్త అలజడి నెలకొంది. నందమూరి తారక రామారావు  పాదం ఇక్కడ లేక తెలుగు భూమి చిన్నబోతోంది.మీ రూపు చూడలేక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది. పెద్ద మనసుతో ఈ భూమిని అలాగే గుండెను మరొక్కసారి తాకిపో తాత... అటు జూనియర్ ఎన్టీఆర్ సంచలన పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ పోస్టు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చేసినట్లు కొంతమంది చెబుతున్నారు. తెలుగు నేల చిన్నబోతుందని  జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెడితే... కొంతమంది దానిని మార్చి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


తాత నువ్వు లేక తెలుగుదేశం పార్టీ చిన్నబోతోంది.. వెంటనే దిగిరా  అంటూ జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టినట్లు... కొంతమంది ఆ పోస్ట్ వైరల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఒంటరి చేశారని... నందమూరి కుటుంబానికి దూరం చేశారని...దీనికి కారణం చంద్రబాబు అని... అందుకే.. జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా పోస్ట్‌ పెట్టినట్లు...కొంత మంది కావాలనే కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ కు ఎలాంటి సంబంధం లేదని ఇటీవలే.. తెలుగు తమ్ముళ్లు అన్నారు. అయితే.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌ గా ఎన్టీఆర్‌ ఇలా కౌంటర్ ఇచ్చారని మరికొంత మంది చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: