- హైద‌రాబాద్ - సికింద్రాబాద్‌లా గుంటూరు - విజ‌య‌వాడ ట్విన్ సిటీస్ కావాల్సిందే
- గుంటూరు కారం, పొగాకుకు అంత‌ర్జాతీయ మార్కెట్‌తో టాప్ లేపాల్సిందే
- గోదారిని ఒడిసి ప‌డితే రైస్ బౌల్ ఆఫ్ ఇండియానే

( విజ‌య‌వాడ‌ - ఇండియా హెరాల్డ్ )


ఉత్త‌రాంధ్ర :

ఉత్త‌రాంధ్ర ప‌రిధిలోని మూడు జిల్లాల‌కు వ‌నరులు అధికంగా ఉన్నాయి. గ‌నులతోపాటు.. అత్యంత కీల‌క‌మైన తీర ప్రాంతం ఉంది. దీనిని స‌మ‌గ్రంగా వినియోగించుకుంటే.. ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు త‌నా న్ని త‌రిమి కొట్ట వ‌చ్చ‌ని.. రాష్ట్ర విభ‌జ‌న‌పై ఏర్పాటైన శ్రీకృష్ణ క‌మిటీ పేర్కొంది. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల‌కు.. అభివృద్ధి చెందేందుకు ఉన్న అన్ని వ‌న‌రులు ఉన్నాయ‌ని తెలిపింది. ఎక్క‌డా భారీ స్థాయిలో పండ‌ని జీడి ఇక్క‌డ పండుతోంద‌ని.. క‌ళ‌లకు నిల‌యంగా విజ‌య‌న‌గ‌రం ఉంద‌ని.. సాగు ఉత్ప‌త్తిలోనూ విస్తీర్ణం ఎక్కువ‌గాఉంద‌ని తెలిపింది. ఇక‌, విశాఖ‌లో ఉన్న తీర ప్రాంతాన్ని వినియోగిం చుకుంటే.. ఖ‌చ్చితంగా అద్భుతాలు సృష్టించ‌వ‌చ్చ‌నికూడా.. శ్రీకృష్ణ క‌మిటీ పేర్కొంది. అయితే.. ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అడుగులు వేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


అమ‌రావ‌తి :

రాష్ట్రానికి రాజ‌ధానిగా ఎంపిక చేసిన ఈ ప్రాంతంపై ఏ చిన్న పాటి శ్ర‌ద్ధ పెట్టినా.. అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. ప‌క్క‌నే ఉన్న కృష్ణా న‌దిని వినియోగించుకుంటే.. న‌దీ ర‌వాణా.. ప‌ర్యాట‌కం పెరుగుతుంది. త‌ద్వారా.. రాష్ట్రానికి ఆదాయంపెరుగుతుంది. ఇక‌, గుంటూరు, విజ‌య‌వాడ ప్రాంతాల‌ను ట్విన్ సిటీస్‌గా అభివృద్ది చేసుకుంటే.. అమ‌రావ‌తి ఉన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌-సికింద్రాబాద్ జంట న‌గ‌రాల‌ను మించిన పేరు వ‌స్తుంది. ఇది చంద్ర‌బాబు హ‌యాంలో కొంత మేర‌కు ముందుకు సాగింది. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మంద‌గించింది. ఇప్ప‌టికైనా.. దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెడితే.. మేలు జ‌రుగుతుంది.

 
ప‌ల్నాడు :

గుంటూరు కారానికి, పొగాకుకు ఉన్న డిమాండ్‌.. అంత‌ర్జాతీయంగా ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అందుకే.. ఈ ప్రాంతంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇక్క‌డ టుబాకో బోర్డును ఏర్పాటు చేసింది. అంతేకాదు.. ప‌క్క‌నే ఉన్న కృష్ణాన‌ది నీటిని ప‌ల్నాడు ప్రాంతానికి త‌ర‌లించే బృహ‌త్త‌ర చ‌ర్య‌లు చేప‌డితే.. ఇక్క‌డ పంట‌ల ఉత్ప‌త్తిని కూడా పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రీముఖ్యంగా ఇక్క‌డ గ‌నులు ఎక్కువ‌గాఉన్నాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. బాక్సైట్‌కు ప‌ల్నాడు కేంద్రం. అదేవిధంగా గ్రానైట్ నులు కూడా.. విరివిగా ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో ప‌ల్నాడు ప్రాంతాన్ని స‌మ‌గ్రంగా వినియోగించుకుంటే మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నెల్లూరు - ప్ర‌కాశం :

నెల్లూరు ప్ర‌కాశం జిల్లాల‌ను జంట జిల్లాలుగా అభివృద్ధి చేయాల‌ని వైఎస్ హ‌యాంలో ఒక ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. ఈ రెండు జిల్లాల‌కు ఉన్న ఏకైక సారూప్య‌త తీర ప్రాంతం ఎక్కువ‌గా ఉండ‌డం. ఇక్క‌డ మ‌త్స్య సంప‌ద‌కు.. ప్ర‌పంచంలోనే మేలైన డిమాండ్ ఉంది. అదేవిధంగా శ్రీలంక త‌దిత‌ర ప్రాంతాల‌కు కూడా.. ఇక్క‌డ నుంచి ఎగుమతులు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ తేనె.. జీడిప‌ప్పు(వేట‌పాలెం) వంటివిప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందాయి. ఇప్ప‌టికీ వేట‌పాలెం జీడిప‌ప్పు.. మామిడికాయ‌ల‌కు ఈ ప్రాంతం పేరు తెచ్చుకుంది. వీటిని మ‌రింత అభివృద్ధి చేస్తే.. ఈ రెండు జిల్లాలు అబివృద్ది చెందుతాయి. అదేవిధంగా వెంక‌ట‌గిరి చేనేత‌ల‌కు గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు.. పేరుంది. ఈ రంగాన్ని మ‌రింత ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రంఉంది.


చిత్తూరు :

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాను ప‌ర్యాట‌క ప్రాంతంగా ముఖ్యంగా ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేయాల‌ని గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భావించింది. అయితే.. కార‌ణాలు ఏవైనా కూడా.. ఇక్క‌డ అభివృద్ధి మాత్రం ముందుకు సాగ‌లేదు. తిరుమ‌ల ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు ప్ర‌ణాళిక‌లు ఉన్నా.. అవి ఎక్కిక‌క్క‌డే నిలిచిపోయాయి. ఇక‌, చిత్తూరును వ‌స్త్ర కేంద్రంగా.. ప‌ట్టుపురుగుల కేంద్రంగా మ‌ల‌చాల‌న్న ప్ర‌ణ‌స్త్రఆళిక‌లు కూడా.. ఎక్క‌డిక్క‌డే నిలిచిపోయాయి. వీటిని ముందుకు తీసుకువెళ్తే.. అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతాయ‌న‌డంలో సందేహం లేదు.

ఉభ‌య‌గోదావ‌రులు :

ప‌చ్చ‌ని సీమ‌ల‌కు పెట్టింది పేరు ఉభ‌య గోదావ‌రిజిల్లాలు. ఇక్క‌డ కోన‌సీమ కొబ్బ‌రి ప్ర‌పంచ ప్ర‌సిద్ధి. కేర‌ళ త‌ర్వాత‌.. ఆ స్థాయిలో ఇక్క‌డ కొబ్బ‌రి ఉత్ప‌త్తులు ఉన్నాయి. కానీ, ప్రాసెసింగ్ యూనిట్లు లేక‌.. రైతులు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొబ్బ‌రి బోర్డును ఏర్పాటు చేయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అదేవిధంగా రైస్ బౌల్(అన్న‌పూర్ణ‌) ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా కూడా.. ఈ ప్రాంతం ప్ర‌శిద్ధి పొందింది. దీనిని మ‌రింత అభివృద్ధి చేయాలంటే.. స‌ముద్రంలోకి పోతున్న గోదావ‌రి జ‌లాల‌ను ఒడిసి ప‌ట్టుకోవ‌డం.. పోల‌వ‌రం వంటి బృహ‌త్త‌ర ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకోవ‌డం వంటివి కీల‌కం.
 

రాయ‌ల సీమ :

రాయ‌ల‌ సీమ‌.. నిజంగానేర‌త్నాల సీమ‌. కానీ, అభివృద్ధి చేయాల‌న్న‌.. స్పృహ‌.. పాల‌కుల‌కు లేక‌పోవ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌. సున్న‌పురాయినిక్షేపాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో సిమెంటు కంపెనీలు.. ఎక్కువ‌గా ఉన్నా యి. పైగా విస్తార‌మైన నేల ఇక్క‌డ అందుబాటులో ఉంది. దీంతో ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చేందుకు అనువైన ప్రాం తం. అయితే.. లేనిద‌ల్లా నీరు. దీనిని ఇక్కడ పారించేందుకు.. గ‌త ప్ర‌భుత్వాలు ప‌నిచేశాయి. త‌ర్వాత‌.. వ‌చ్చిన ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేశాయి. దీంతో ఈ నాలుగు జిల్లాల్లోనూ అభివృద్ది ఒట్టిమాటే అయింది. రాయ‌ల సీమ ఉద్య‌మాల‌కు కూడా ఇక్క‌డ ప్రాధాన్యం పెరిగింది. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు ప్ర‌య‌త్నించాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: