- న‌ధుల అనుసంధానం చేస్తే ఆంధ్రోడు వ్య‌వ‌సాయంలో రాజే
- ప‌ట్టిసీమ‌తో న‌దుల అనుసంధానంకు శ్రీకారం చుట్టిన బాబు

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

9 వేల కిలోమీట‌ర్ల సుదీర్ఘ సాగ‌ర తీరం ఉన్న ఏపీకి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోనే వ‌రి ఎక్కువ‌గా పండించే రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉంది. అయితే.. రాను రాను దిగుబ‌డి త‌గ్గిపోతుండ‌డం గ‌మ‌నార్హం. కోస్తా జిల్లాల్లో వ‌రి.. సీమ ప్రాంతాల్లో వాణిజ్య పంట‌ల‌కు ప్ర‌సిద్ధిచెందిన రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీటి స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఒక‌వైపు కృష్ణా, గోదావ‌రి వంటి ప్ర‌ధాన న‌దులు ఉన్నా.. నీటి ఇబ్బందు లు మాత్రం మామూలుగా లేవు. ఇది కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్యే అయినా.. దీనిని ప‌రిష్క‌రించేం దుకు ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన ప్ర‌య‌త్నం అయితే చేయ‌లేదు.


దీంతో ఇప్ప‌టికీ జిల్లాల‌కు జిల్లాలు నీటి కోసం ఎదురు చూస్తున్న పిరిస్థి తి నెల‌కొంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కా రం అయితే.. క‌ల‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాకారం కావ‌డం పెద్ద దూరంలో అయితే లేదు. దీనికి కావాల్సింది.. న‌దుల అనుసంధానం. కృష్ణా, గోదావ‌రి నదులతోపాటు.. ఇత‌ర నదుల‌ను కూడా.. (రాష్ట్రంలోకి వ‌చ్చేవి) క‌ల‌ప‌డం ద్వారా.. సాగునీటిని పెంచుకునే అవ‌కాశం ఉంద‌ని.. కొన్ని ద‌శాబ్దాల కింద‌టే.. క‌మ్యూనిస్టు నాయ‌కుడు.. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య అధ్య‌య‌న పూర్వ‌కంగా వివ‌రించారు.


ఆ త‌ర్వాత‌.. దీనిని అమ‌లు చేస్తామ‌ని చెప్పిన ఎన్టీఆర్ కానీ.. త‌ర్వాత వ‌చ్చిన వైఎస్ కానీ.. ప్ర‌య‌త్నించ లేదు. దీనికి ప్రాంతీయ స‌మ‌స్య‌లు.. రైతు సంఘాల ఉద్య‌మాలు కూడా.. అడ్డుక‌ట్ట వేశాయి. ఫ‌లితంగా అటు తెలంగాణ‌, ఇటు ఏపీ కూడా.. సాగు నీరు, తాగు నీరు కోసం ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితి క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో 2017-18 మ‌ధ్య అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం న‌దుల అనుసం ధానం అనేక్ర‌తువును భుజాన వేసుకుంది. త‌ద్వారా.. సముద్రంలోకి నీరు వృధాగా పోకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది.


విజ‌య‌వాడ శివారు ప్రాంతంలోని ఇబ్ర‌హీంప‌ట్నం వ‌ద్ద ఉన్న ఫెర్రీ వ‌ద్ద‌.. ప‌విత్ర సంగ‌మం పేరుతో కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను క‌లిపారు. అయితే.. ఈ ప్రాజెక్టును ముందుకు న‌డిపించాల్సి ఉంది. ఒక్క ఈ ప్రాంతం లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ న‌దుల అనుసంధానం జ‌రిగితే.. కామ్రెడ్ పుచ్చ‌ల ప‌ల్లి సుంద‌ర‌య్య చెప్పిన‌ట్టు రాష్ట్రంలో సాగుచేసే వాడు రాజు అవుతాడు. ఆశావ‌హ విష‌యం ఏంటంటే.. తాజా ఎన్నిక‌ల్లో ఒక‌టికి రెండు సార్లు చంద్ర‌బాబు ఈ విష‌యం చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వ‌స్తే.. న‌దుల అనుసంధానం ప్రాజెక్టులు పూర్తి చేస్తామ‌న్నారు. మ‌రి ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పును బ‌ట్టి ఈ ప్ర‌క్రియ ఆధార‌ప‌డి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: