నందమూరి బాలకృష్ణ మనందరికీ సుపరిచితమే. అయినా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకి గట్టి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే బాలకృష్ణహీరోయిన్ తో అనుచితంగా ప్రవర్తించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఒక కార్యక్రమానికి హాజరైన బాలయ్య తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. దీంతో ఆమెను పక్కన ఉన్న మరో హీరోయిన్ నేహా శెట్టి పట్టుకుంది. ఆ తర్వాత అంజలి స్టిఫ్ గా నిల్చునే  ప్రయత్నం చేసింది.

లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయట పడకుండా కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంత పెద్ద హీరో అయి ఉండి హీరోయిన్ తో అలా బిహేవ్ చేస్తారా? ఛీ ఛీ ఎప్పుడు మారతారో అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం అది జోక్ గా చేసింది మాత్రమే.. దాన్నిని ఈ విధంగా చూడడం తప్పు... అంటూ సమర్థిస్తున్నారు. ఇక ఇదంతా విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన బాలకృష్ణ అంజలితో అలా ప్రవర్తించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అదేవిధంగా బాలకృష్ణ ఇదే ఈవెంట్లో వాటర్ బాటిల్ లో మద్యం కలుపుకుని సేవించినట్లు సమాచారం. అయితే బాలకృష్ణ చేసిన పనికి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. కొందరు ఘోరాతి ఘోరంగా విరుచుకుపడుతున్నారు కూడా. ఇటువంటి వాడిన సినిమాల్లో మరియు రాజకీయాల్లో తెగ గొప్పగా చెప్పుకుంటున్నారు? తాగి సినిమా ఈవెంట్స్ కి వచ్చేవారు మీ ఫేవరెట్ హీరో? ఇప్పటికైనా కళ్ళు తెరవండి? అందరూ ఉండగానే అంజలిని ఆ విధంగా తోసేసాడు అంటే? ఎవరు లేనప్పుడు ఏం చేస్తాడో? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: