ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి నిత్యం సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులపై పలు కామెంట్స్ చేసి సంచలనం సృష్టిస్తూ ఉంటాడు. అంతేకాకుండా సంసారాలు, వైవాహిక జీవితాలు పటాకులు అవడం వంటిది చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తాడు. అయితే సినిమాలు హిట్ అవుతాయా లేదా అనేది కూడా చెప్తాడు. అదేవిధంగా కొంతమంది హీరోయిన్స్ కు ప్రత్యేక పూజలను కూడా చేపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోని వేణు స్వామి పై పలు ట్రోల్స్  కూడా వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా వేణు స్వామి పలు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి షాపింగ్ కామెంట్స్ చేశారు.‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవచ్చు కానీ సీఎం మాత్రం అయ్యే అవకాశం లేదన్నారు.

పవన్ కళ్యాణ్ జాతకంలో సీఎం అయ్యే యోగం లేదని..‌ రాజకీయాల్లో మోసపోతారని వేణు స్వామి తెలియజేశారు. ఈ జోస్యంతో పవన్ అభిమానులకి చిర్రొత్తుకొచ్చేలాగా  చేశాడు వేణు స్వామి. అయినా సక్సెస్ రేట్ 98% చెప్పుకుంటారని.. కానీ స్వామి చెప్పిన విషయాలు అన్నీ జరుగుతాయ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవంటూ మండిపడుతున్నారు. ఇక తాజాగా ఈ ట్రోలింగ్ దెబ్బకు బుద్దు తెచ్చుకున్న వేణు స్వామి మాట మార్చాడు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరిక తనకు కూడా ఉందని.. పవన్ అంటే విపరీతమైన పిచ్చి అని తెలియజేశారు.

జగన్మోహన్ రెడ్డిని ఓడించి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వేలు స్వామి వెల్లడించారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈయన కామెంట్స్ ని చూసిన పలువురు... చదవకముందు కాకరకాయ చదివిన తర్వాత కేకరగాయి అన్నట్టుగా మాట భలే మార్చేశావు వేణు స్వామి? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని హేళన చేసే మాట్లాడిన నువ్వు ఇప్పుడు పెద్ద పత్తితి లాగా మాట్లాడుతున్నావు? నీ జాతకాలని నమ్మినవాడు నిలువునా మునిగిపోతాడు.. నిజమైన జ్యోతిష్కం చెప్పేవాడు ఎవరూ మీలాగా ఎగస్ట్రాలు చేయరు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: