ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఓట్ల లెక్కింపు వచ్చే నెల నాలుగవ తేదీన జరగబోతోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేసినట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ తో పాటు ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా వెల్లడించారు.. నిన్నటి రోజున వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ ఏపీలో ఓట్ల లెక్కింపు నియోజకవర్గాల వారి నుంచి వారిగా చేస్తున్న ఏర్పాటుల పైన కూడా సమీక్షించామంటూ వెల్లడించారు. అంతేకాకుండా కౌంటింగ్ కోసం చాలా పసిస్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశామంటూ వెల్లడించారు.


ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపునకు చాలా పశిష్టమైన ఏర్పాటు చేశామని ఫలితాల ప్రకటనలు సత్వరమే తెలుసుకుంటామన్నట్లుగా తెలియజేశారు.. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలలో 111 నియోజకవర్గాలలో  20  రౌండ్ల  లోపు 61 నియోజకవర్గాలలో 21 నుంచి 24 రౌండ్ లలోపు కౌంటింగ్ జరుగుతుందంటూ వెళ్లాడించారు.111 నియోజవర్గాలకు మధ్యాహ్నం రెండు గంటల లోపు 61 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల లోపు మిగిలిన మూడు స్థానాలు సాయంత్రం 6 గంటల లోపు లెక్కించబడుతుంది అంటూ తెలియజేశారు.


అలాగే టేబుల్ లను పెంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సకాలంలో పూర్తి చేస్తామంటూ కూడా తెలిపారు. అదే రోజు రాత్రి 8 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు కూడా విడుదలవుతాయని అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేశామంటూ కూడా తెలిపారు. అలాగే ఎన్నికలు సమయంలో చాలా చోట్ల హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయని ఇది చాలా బాధాకరమని ఓట్లు లెక్కింపు రోజు అలాంటివి జరగకుండా వశిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని రాష్ట్రమంతా కూడా 144 సెక్షన్ ని అమలు చేశామంటూ వీటితో పాటు సీనియర్ అధికారులను కూడా నియమించామని ముఖేష్ మీనా తెలియజేశారు. అలాగే పలు జిల్లాలలో డిజిపి లతో స్వయంగా మాట్లాడి అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ ఉన్నామని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రలకు ఎలాంటి అగాతం తొలగించకుండా ఉండేందుకే పోలీసులను ఇతర బలగాలను కూడా తీసుకువచ్చామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: