- ప‌సుపు నేత‌ల వ్యాపారాల‌కు చిక్కులే
- ఆర్థిక క‌ష్టాల‌తో పార్టీ బ‌త‌క‌డం క‌ష్ట‌మే ?
- బీసీ, మైనార్టీలు శాశ్వతంగా దూర‌మ‌య్యే ప్ర‌మాదం..?

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

నేత‌ల వ్యాపారాల‌పై ప్ర‌భావం
టీడీపీ క‌నుక ఈ ఎన్నిక‌ల్లో ఓడితే.. కీల‌క నేత‌లు త‌మ వ్యాపారాల‌ను దాదాపు నిలుపుద‌ల చేసే ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే గ‌త రెండేళ్లుగా క్వారీ, గ‌నులు, లిక్క‌ర్ వ్యాపారాల్లో ఉన్న టీడీపీ నేత‌లు.. న‌ష్టాల్లో ఉన్నారు. పైగా వారిపై దాడులు కూడా జ‌రిగాయి. న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యించే ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. అద్దంకి, ప‌రుచూరు ఎమ్మెల్యేల‌ ప‌రిస్థితి ఈ జాబితాలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.


ఆర్థిక దిగ్బంధం
ఈ ద‌ఫా టీడీపీ క‌నుక ఓడిపోతే.. నాయ‌కులు స‌హా పార్టీకి నిధుల స‌మ‌స్య స్ప‌ష్టంగా క‌నిపించ‌నుంది. ఏమేర‌కు ప్ర‌భావం ఉంటుంద‌నేది గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన ప‌రిణామాలే స్ప‌ష్టంగా చెబుతాయి. నిజానికి ఒక‌ప్పుడు కార్పొరేట్ సంస్థ‌లు పార్టీకి ఫండింగ్ చేశాయి. కానీ, గ‌త ఐదేళ్ల‌లో టీడీపీకి 87 కోట్ల‌రూపాయ‌లు వ‌స్తే.. వైసీపీకి రు. 347 కోట్లు విరాళం గా ఇచ్చారు. ఇప్పుడు వ‌చ్చే ఐదేళ్ల‌లో టీడీపీ మ‌రింత‌గా న‌ష్ట‌పోతుంది.


త‌మ్ముళ్ల వివాదాలు
టీడీపీ క‌నుక అధికారంలోకి రాక‌పోతే..పార్టీలో త‌మ్ముళ్ల మ‌ధ్య వివాదాలు కూడా పెరిగిపోవ‌డం ఖాయం. ఆధిప‌త్యంపై నాయ‌కులు మ‌రింత పోరాటానికి దిగే అవ‌కాశం ఉంది. ఇదేస‌మ‌యంలో పార్టీలోనూ చైత‌న్య స్ఫూర్తి కొర‌వ‌డ‌డం ఖ‌చ్చితంగా క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు పార్టీని బ‌తికించేందుకు.. త‌మ్ముళ్ల‌ను పార్టీ అధినాయ‌క‌త్వం బ్రతిమాలుకునే ప‌రిస్థితి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు.


బీసీ ఓటు బ్యాంకుపై ప్ర‌భావం
టీడీపీ ఓడితే.. బీసీల ఓటు బ్యాంకు చాలా వ‌ర‌కు దూర‌మ‌వుతుంది. అదేవిధంగా బీసీల మ‌ద్ద‌తు కూడా పార్టీకి ఉండ‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు.. పార్టీకి అండ‌గా ఉన్న బీసీల‌ను దూరం చేసుకునే ప‌రిస్థితి కూడా ఉంటుంది.


మైనారిటీలు క‌ష్ట‌మే
టీడీపీ క‌నుక ఈ ద‌ఫా అధికారంలోకి రాక‌పోతే.. మైనారిటీ ఓటు బ్యాంకును నిల‌బెట్టుకోవ‌డం ఇక‌, సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఇప్ప‌టికే ఒక‌సారి బీజేపీతో అంట‌కాగినందుకు.. 2014, 2019లోనూ ముస్లింలు ఆ పార్టీకి దూర‌మ‌య్యారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లోనూ బీజేపీతోనే ఉన్ననేప‌థ్యంలో మైనారిటీ ఓటు బ్యాంకుపై ప్ర‌భావం ప‌డనుంద‌నే అంచనాలు ఉన్నాయి. అయితే.. అధికారంలోకి వ‌స్తే.. కొంత వ‌ర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల నాటిని వారిని మ‌చ్చిక చేసుకునే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: