ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్ రెడ్డి విశాఖపట్నం సహా ఉత్తర కోస్తా జిల్లాల్లో అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారని, నార్త్ రీజియన్ లో భూములను కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణ వల్ల ఆయన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ఇదే సందర్భంగా ఆయన చేసిన మంచి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఏపీకి ఆయన చేసిన మంచి గురించి మనం కూడా తెలుసుకుందాం.

జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును రూపొందించడానికి లక్ష్యంగా పెట్టుకుని అనేక వినూత్న సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, సస్టైనబులిటీ వంటి వివిధ రంగాలపై ఆయన దృష్టి సారించారు.

జవహర్ రెడ్డి నాయకత్వంలో వికసిత్‌ ఆంధ్రా-2047 అనే ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ పురుడు పోసుకుంది. ఈ చొరవ కింద 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రోగ్రాంలో వాణిజ్యం, పర్యాటకం, షిప్‌బిల్డింగ్‌తో సహా అనేక రంగాలలో సమగ్ర ప్రణాళికలు ఉన్నాయి, దీని గోల్ కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, మద్దతును పొందడమే అని చెప్పుకోవచ్చు. విద్య రంగంలో జవహర్ రెడ్డి "నాడు-నేడు" పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడానికి కృషి చేశారు. ఈ పథకం ద్వారా పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు.

జవహర్ రెడ్డి పాఠశాలల ఆధునికీకరణను వేగవంతం చేయడం, నమోదు రేట్లను మెరుగుపరచడంపై దృష్టి సారించారు. 5-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరూ 100% పాఠశాల హాజరును సాధించేలా చర్యలు చేపట్టారు. అలానే రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ముఖ్య కార్యదర్శి కృషి చేశారు. వ్యవసాయ రంగంలో సంక్షోభాలకు స్పందించడంలో, రైతులకు సహాయం చేయడంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: