ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఓడిపోతే ఎక్కువగా నష్టపోయే నేత ఎవరు అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గత పదేళ్ల నుంచి చంద్రబాబు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయించినా అంగీకరించి ఈ ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించారు. కూటమి గెలిచి చంద్రబాబు సీఎం అయినా పవన్ కళ్యాణ్ కు ఏ పదవి ఇస్తారో క్లారిటీ లేదు.
 
అయితే భవిష్యత్తులో అయినా సీఎం కావాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. ఒకవేళ కూటమి ఓడిపోతే బాబు కంటే పవన్ కే నష్టమని రాష్ట్రంలో జనసేన ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి ఈ ఎన్నికల్లో ఓడిపోతే భవిష్యత్తులో జనసేనతో పొత్తు కావాలని టీడీపీ కోరే అవకాశాలు కూడా దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది.
 
పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే లక్ష్యం నెరవేరాలని అభిమానులు మాత్రం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. పవన్ రాజకీయాల్లో సక్సెస్ సాధించడం కోసం సినిమాలకు సంబంధించి కూడా ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. మరి పవన్ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందో లేదో మరో ఐదు రోజుల్లో వెలువడే ఫలితాలతో తేలిపోనుంది. ఏపీ ఎన్నికల ఫలితాలు ఎంతోమంది భవిష్యత్తును సైతం ప్రభావితం చేయనున్నాయి.
 
పవన్ కళ్యాణ్ జనసేనను ప్రధాన పార్టీల స్థాయిలో నిలబెట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో ఏపీ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి గెలిస్తే పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక లక్ష్యాలతో రాజకీయాలు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కచ్చితంగా విజేతగా నిలుస్తారని అభిమానులు ఫీలవుతున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: