ఒకప్పటి ఎన్నికలు ఒకెత్తు, ఈసారి ఎన్నికలు ఒకెత్తు. ఈసారి ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారడానికి కారకుడు మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ అని చెప్పుకోక తప్పదు. అవును, ఆల్మోస్ట్ అయిపోయిందన్న టీడీపీ పార్టీకి ఊపిరి పోసింది ఈయనే అని జనాలకి బాగా తెలుసు. అయితే కొంతమంది ఈగో దీనిని ఒప్పుకోలేకపోవచ్చు. ఏది ఏమైనా నేడు ఆంధ్ర రాజకీయాలను శాసించింది, శాసిస్తున్నది జనసేనుడే అని ఇక్కడ ఏ చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతాడు. ఇక ఎన్నికల రిజల్ట్స్ దగ్గర అపడుతుండడంతో సర్వేలు ఊపందుకున్నాయి. ఇపుడు దాదాపుగా వచ్చిన సర్వేలన్నీ పవన్ కళ్యాణ్ ని సెంట్రల్ గా చేసుకొని వస్తున్నవే కావడం గమనార్హం.

అయితే, ఇందులో కొన్ని పెయిడ్ సర్వేలు కూడా ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు. ప్రీ పోల్ సర్వేలు ఒక ఎత్తు అయితే పోస్ట్ పోల్ సర్వేలు మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా ఈ తరహా సర్వేలతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. ఇపుడు అందరూ ఆతృతగా ఎదురు చూసే కీలక సమయం ఆసన్నమైంది. అవును, ఎగ్జిట్ పోల్ సర్వేల రిలీజ్. జూన్ 1న ఆఖరి విడత లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో పూర్తి అవుతుంది. ఆ మరుక్షణమీ ప్రముఖ మీడియా చానళ్ళలో వరసబెట్టి ఎగ్జిట్ పోల్ సర్వేలు దంచి కొడతాయి. అయితే ఈసారి యావత్ దేశం మొత్తంలో ఎక్కువ మందికి ఏపీ మీదనే దృష్టి ఉంది. దానికి కారణం కూటమినే.

దాంతో ఇపుడు ఆయా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతాయా అన్నదే ఇపుడు ఉత్కంఠ. కాగా ఎగ్జిట్ పోల్స్ ని చూసి టెన్షన్ పడవద్దని విపక్షాలు తమ పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఇక ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతాయన్న దాని మీద కూడా రకరకాలైన ప్రచారాలు ఉన్నాయి. అవును, ఇపుడు ఏపీలో వార్ వన్ సైడ్ అయింది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పబోతున్నాయట. అందరూ అనుకుంటున్నట్లుగా బొటా బొటీ మెజారిటీ రావడం అస్సలు కుదరదని అంటున్నారు. గెలిచిన పార్టీ ఏదైనా 130కి తక్కువ లేకుండా రావచ్చు అని అంటున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి అలాగే టీడీపీ కూటమికి కూడా అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వచ్చాయని గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఎవరికి ఎక్కువ వచ్చాయి అన్నది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: