ఎన్నికల రిజల్ట్స్ మరో 4 రోజుల్లో తేలనున్నాయి. దాంతో ఎవరి లెక్కలు ఏమిటో తేటతెల్లం అయిపోతుంది. ఈసారి కూటమి అభ్యర్థులు ఎలాగన్నా, ఎవరేమనుకున్నా అధికారం తమదేనంటూ ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే బాబు ఈ నెల 30 నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో ఉంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కడే ఉంటూ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోకి కూడా వెళ్తారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకూ బాబు ఉండవల్లిలోని నివాసం నుంచే పరిశీలన చేస్తారని పార్టీ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో ఈ నెల 31న ఉండవల్లిలోని తన నివాసంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కలసి పోలింగ్ సరళి మీద పూర్తి స్థాయిలో చర్చిస్తారు అని తెలుస్తోంది. అప్పటికి పోలింగ్ జరిగి 18 రోజులు అవుతుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి పూర్తి సమాచారం తెప్పించుకొని ఇరువురు నేతలూ దాని మీదనే కసరత్తులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ కూటమి గెలిచి తీరుతుందని ఇప్పటికే పార్టీ నేతలకు చెప్పిన చంద్రబాబు జూన్ 4 ఫలితాల వరకూ ఓపిక వహించాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. ఇక జనసేన టీడీపీ కలసి ఫలితాల విషయంలో పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తరువాత కౌంటింగ్ గురించి కూడా చర్చిస్తారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక ఈ ఇరువురి భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పాలు పంచుకోనున్నట్టుగా సమాచారం. కాగా పోలింగ్ రోజున జనసేన టీడీపీ బీజేపీ పూర్తి కో ఆర్డినేషన్ తో పనిచేసి మంచి ఫలితాలు రాబట్టిన సంగతి తెలిసినదే. ఎక్కడా కూడా ఇరు పార్టీల వారు గొప్పలకు పోయిన దాఖలాలు కనబడలేదు. అదే విధంగా కౌంటింగ్ రోజున కూడా ఒక కో ఆర్డినేషన్ తో పనిచేయాలని కూటమి పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వకుండా ప్రతీ ఒక్క ఓటూని లెక్కించేలా చూడాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మొత్తం మీద చాలా కాలానికి పవన్ చంద్రబాబు వారి వారి భ్రమలు వదిలి భేటీ కాబోతున్నారన్న మాట. ఇక ఈ భేటీ తరువాత ఇరువురు నేతలూ ఏపీలో టీడీపీ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది మీడియాకు చెబుతారా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: