ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.... ఏపీ సి ఎస్ జవహర్ రెడ్డి పేరు హాట్ టాపిక్ గా నిలిచింది. ఎక్కడ చూసినా జవహర్ రెడ్డి.. జవహర్ రెడ్డి... పేరు మాత్రమే మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలను... చాలా సమర్థవంతంగా తెలుగు జాతి తల ఎత్తుకునేలా నిర్వహించారు ఏపీ సి ఎస్ జవహర్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఏపీసిఎస్ జవహర్ రెడ్డిని... టార్గెట్ చేసి చాలా విమర్శలు చేస్తున్నాయి.

 ఉత్తరాంధ్రలో... చాలా భూములు అక్రమంగా కొనుగోలు చేశాడని ఆయనపై ఆరోపణలు చేస్తున్నాయి. నిజాయితీకి మారుపేరుగా ఉన్న.... ఏపీ సి ఎస్ జవహర్ రెడ్డి మాత్రం... తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి... ఇప్పటివరకు నిజాయితీ అలాగే నిబద్ధతతో పని చేశారు. తెలుగు జాతిని అభివృద్ధి చేయడంలో తన వంతు పాత్ర  పోషించారు జవహర్ రెడ్డి.

 ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గానే కాకుండా.... ఆరోగ్య రంగం, గ్రామీణ అభివృద్ధిలో ఇలా ఎన్నో రంగాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ రంగంలో పనిచేసిన... ఏ శాఖ బాధ్యతలు అప్పగించిన... జవహర్ రెడ్డి గారికి మనం జై కొట్టాల్సిందే. అంతటి పనితీరు గల అధికారి జవహర్ రెడ్డి.
 ముఖ్యంగా కరోనా మహమ్మారి లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో... ఆంధ్రప్రదేశ్ ప్రజలను  బతికించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు... తన వంతు కృషి చేసి సక్సెస్ అయ్యారు.

 తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా కూడా ఆయన పని చేసి తనకంటూ మంచి మార్క్ సంపాదించుకున్నారు. వివాదాలకు నిత్యం దూరంగా ఉండే...  జవహర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెచ్డిఎంఏ కమిషనర్ గా కూడా పనిచేసే సత్తా చాటారు. ఆయన పనితీరుకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు... కూడా తన వంతు పాత్రను పోషించారు జవహర్ రెడ్డి. ఆ సమయంలో పంచాయతీరాజ్ శాఖకు ముఖ్య కార్యదర్శిగా కూడా జవహర్ రెడ్డి చాలా చక్కగా పనిచేశారు. ఇలా మూడు దశాబ్దాల పాటు... తెలుగు గడ్డ కోసం నిర్విరామ సర్వీసును అందించారు జవహర్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: