ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి ఈయన పేరు చెబితే  లంచగొండి ఉద్యోగులు,  దొంగ రాజకీయ నాయకులు వణికి పోతారు. వర్క్ అంటే జవహర్ రెడ్డి, జవహర్ రెడ్డి అంటే  వర్క్ అనే విధంగా ఏ పని చేసినా  చాలా నిబద్ధత కలిగి ఉండే ఆఫీసర్. అంత ట్రాక్ రికార్డు ఉంది కాబట్టే  ఆయనను జగన్మోహన్ రెడ్డి సిఎస్ గా అపాయింట్ చేసుకున్నారు. అలాంటి జవహర్ రెడ్డి తన కెరియర్లో  ఎన్నో చూశాడు. ఎన్నో జిల్లాలకు కలెక్టర్ గా చేసి అక్కడ పరిస్థితులను అవపోసన పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు  ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పేదవాడు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి పథకాలు తీసుకురావాలి ఎలాంటి ఆలోచనలు చేయాలనే దాంట్లో జవహర్ రెడ్డి ముందుంటారు. 

ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి జవహర్ రెడ్డిపై అసత్యపు ఆరోపణలు చేసి రాజకీయ పార్టీలు పబ్బం గడుపుతున్నారు. ఆయన ఏ ప్రభుత్వంలో పనిచేసిన రాజకీయాలకు అతీతంగా ఉంటారు. అలాంటి జవహర్ రెడ్డిని  ఇంతమంది టీడీపీ వాళ్లు  ఈయన జగన్ మనిషని, జగన్ చెప్పిందే వింటాడని ఒక  నిరాధారమైన ఆరోపణ చుట్టేశారు.  నిజం రెండిళ్లు దాటేలోపు అబద్ధం 100 ఇండ్లు చుట్టు వస్తుందట. ఆ విధంగానే ఆయనపై చేసే ఆరోపణలన్నీ  అవాస్తవాలని తెలిసిన కొంతమంది టిడిపి బ్యాచ్ పనిగట్టుకుని భజన చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. చంద్రబాబుకు వంతపడే టీవీ చానల్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన ఏదో పెద్ద తప్పు చేసినట్టు భజన చేస్తున్నారు.  

రైతుల కష్టాలు, మంచినీటి కోసం ఇబ్బందులు  ఎదుర్కొంటున్న సమస్యలు  ఏమాత్రం చూపించనటువంటి మీడియా జవహర్ రెడ్డి మ్యాటర్ ను విపరీతంగా ప్రసారం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా  జవహర్ రెడ్డి మాత్రం వణుకు బెణుకు లేకుండా తన పని తాను చేసుకుంటున్నారు. అలాంటి ఆయన ఏపీ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో జవహర్ రెడ్డి పాత్ర కీలకమని చెప్పవచ్చు. ఈ విధంగా అభివృద్ధి అంటే జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి అభివృద్ధి అనే  డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఆయనపై  నిజం కానీ సత్యదూరపు ఆరోపణలు చేయడం సమంజసం కాదని కొంతమంది తనను దగ్గర నుంచి చూసిన ఆఫీసర్లే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: