అయితే సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని రాజకీయ ఉద్దండడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అపారమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఇక ఆయన విజయం ముందు ఎంతటి రాజకీయ నాయకుడైన దిగదుడుపే అనే విధంగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున పోరాటం చేశారు ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు సీఎంగా సేవలందించారు
కాలేజీ టైం నుంచి ప్రజా సేవ చేయాలని కోరిక చంద్రబాబుకు ఉండేది. అయితే ముందు ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకున్నారు. రాజకీయాలే సరైనవని నిర్ధారించి విద్యాభ్యాసం పూర్తికాకముందు.. తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం టిడిపి అధినేతగా ఉన్న చంద్రబాబు రాజకీయ ప్రస్థానం హస్తం పార్టీతోనే మొదలైంది. మొదట శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ స్థానిక నేతల కారణంగా తన పోటీని విరమించుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి