ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారంలో భాగంగా 'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను' అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అశేష జనవాహిణి, జనసైనికులు, అభిమానులు, కుటుంబ సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.తాను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పవన్ కళ్యాణ్ తన పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేయడంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆలింగనం చేసుకోవడం అందరినీ ఎంతగానో ఆకర్షించింది. నిన్న సాయంత్రమే మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో పాటు కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకోవడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారం జరుగుతున్న స్థలానికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో #PawanKalyanAneNenu, #GameChanegerPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ లు X, ఫేస్ బుక్, ఇన్ స్టా తదితర ప్లాట్ ఫామ్ లలో బాగా ట్రెండింగ్ అవుతుంది, ఇప్పటి దాకా #PawanKalyanAneNenu హ్యాష్ ట్యాగ్ పై ఒక్క X లోనే ఏకంగా లక్ష 6 వేల పోస్టులు పెట్టడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఆయన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన, కుమార్తె ఆద్యలు కూడా హాజరవ్వడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కాగా 10 సంవత్సరాల నుంచి ఎన్నో ట్రోల్స్ కి గురయ్యి ఎన్నో అవమానాలు పడి చాలా కష్టపడి జనాల్లోకి వెళ్లి ప్రచారాలు చేసి చివరికి 100 % విజయం సాధించి పవన్ కళ్యాణ్ రాజకీయవేత్తగా తన కోరికని నెరవేర్చుకున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ పవన్ గెలుపు పట్ల కాలర్ ఎగరేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: