జగన్మోహన్ రెడ్డి  ప్రస్తుతం మాజీ సీఎం  హోదాలోకి వచ్చారు. అలాంటి ఆయన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఓటమికి గల కారణాలు ఏంటో  పలు సమీక్ష సమావేశాలు పెట్టి తెలుసుకుంటున్నారు. అయితే జగన్ ఓడిపోగానే ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జగన్ కు ప్రాణం మీద చాలా భయం ఉండేదని, అందుకే అలా చేసేవారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం చేసేవారు ఆ వివరాలు ఏంటో చూద్దాం.  జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ చాలా బందోబస్తుగా ఉండేది. ఆయన సభ పెడుతున్నారంటే  తప్పకుండా అర్ధ కిలోమీటర్ దూరంలో ఎక్కడ కూడా  ఎత్తైన చెట్లు  లేకుండా చూసుకునే వారట. 

ఒకవేళ ఆ చెట్లు ఉంటే తప్పనిసరిగా వాటిని నరికేవారట. ఒకవేళ నరకలేని పరిస్థితి ఉంటే అక్కడే పోలీసులు ఉండేవారట. అలాగే జగన్ ఎక్కడైతే సభలో మాట్లాడుతారో ఆ సభ ప్రాంగణం  వెనుక వైపు తప్ప అన్ని వైపులా ఎక్కడ కూడా ఎత్తయిన బిల్డింగులు ఉన్నా కానీ, వాటిలో ముందుగానే పోలీసులు వెళ్లి చెకింగ్ లు చేసి సభ అయిపోయే వరకు అక్కడే ఉండేవారట. ఎత్తయిన టవర్లు కనిపించిన ఆ టవర్ల దగ్గర పోలీసులు వెళ్లి ఎవరు ఎక్కకుండా చూసుకునే వారట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి  మొత్తం ఎన్నికల సభలతో కలిపి 400 పైగా సభల్లో పాల్గొన్నారు. ఏ సభలో పాల్గొన్న ఇవి తప్పనిసరిగా పాటించేవారట. అంత సెక్యూరిటీ తన కళ్ళ ముందు ఉన్నా కానీ ఎటు కిలోమీటర్ దూరంలో తప్పకుండా ఈ రిస్ట్రిక్షన్స్  ఉంటేనే జగన్ సభలో పాల్గొనేవారని తెలుస్తోంది.

 ప్రస్తుతం తాడేపల్లిలో ఉండేటువంటి తన నివాసం చుట్టూ కూడా  తన బిల్డింగ్ కంటే ఎక్కువ కంచెను ఏర్పాటు చేసుకున్నారు.  ముఖ్యమంత్రి పదవి దిగిపోగానే ప్రభుత్వ సెక్యూరిటీ వెళ్ళిపోయింది కాబట్టి చాలామంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను తన సెక్యూరిటీ కోసం విపరీతంగా వాడుకునే వారని, దీనిబట్టి చూస్తే ఆయనకు ప్రాణభయం ఎక్కువగా ఉండేదని  అందుకే ఎత్తయిన చెట్లు, బిల్డింగులు ఎక్కడున్నా పోలీసులు అక్కడే ఉండేవారని  మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఎత్తయిన చెట్లు ఉంటే ఆయనకేం ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారు కదూ. ఎత్తైన చెట్టు నుంచి ఎవరైనా దుండగులు ఫైర్ చేస్తే ఎలా అని ఆయన విపరీతంగా భయపడే వారట. మరి ఈ విధమైనటువంటి భయాందోళన ఉంటే మాత్రం  చంద్రబాబు దీంతో నాలుగు సార్లు సీఎం అయ్యారు మరి ఆయన ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారట.  ఏది ఏమైనా జగన్ భయపడినంత మిగతా ఈ నాయకులు ఎవరు భయపడరని,  ఆయనకు ప్రాణభయం ఎక్కువగా ఉందని సోషల్ మీడియా విపరీతంగా చర్చిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: