2024 లో ఆంధ్రప్రదేశ్లో  జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు, ఉద్యోగులకు, కొన్ని వ్యవస్థలకు సైతం ఎన్నో హామీలను చెప్పడం జరిగింది. అలాంటి వాటిలో వాలంటరీ వ్యవస్థ కూడ ఒకటీ. వీరికి పదివేల రూపాయలు జీతం చేస్తామంటూ హామీ ఇచ్చారు. అసలు ఈ వాలంటరీ వ్యవస్థను అమలు చేస్తారా లేదా..? అనే విషయం పైన కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ పైన పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.



చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే వాలంటరీ సేవలను సైతం సమర్థవంతంగా అందరూ వినియోగించుకోనేలా ఉండాలని అధికారులకు సూచనలు ఇచ్చినట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థను సరి కొత్తగా నిర్మించి వారికి ఉద్యోగ కల్పన కూడా ఇచ్చేలా ప్రణాళికలు చేపడుతున్నామంటూ తెలిపారు. ఈ క్రమంలోనే ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వాలంటరీ వ్యవస్థ పైన పలు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక పార్టీ కోసమే పని చేసే ఒక వ్యవస్థగా మొదలయ్యిందని ప్రస్తుతం వాలంటరీలు కొనసాగించాలని కూడా అభ్యర్థనలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఈ విషయం పైన ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పగలనని తెలియజేశారు RRR.


అదేమిటంటే వాలంటరీలు లేకపోయినా కూడా ప్రజలకు వారి యొక్క  కంఫర్ట్ ఎక్కడికి పోలేదు.. దీని పైన ఇంతకంటే అసలు ఏమి మాట్లాడలేనంటూ తెలియజేశారు రఘురామకృష్ణంరాజు. అలాగే వాలంటీర్లకు సైతం న్యాయం జరిగేలా చూస్తోంది అంటూ కూటమి సర్కార్ అందుకు తగ్గట్టుగా  ఆలోచనలో చేస్తోందని కూడా తెలియజేశారు రఘురామకృష్ణంరాజు. అయితే ఒకపక్క వాలంటరీ వ్యవస్థ వృధా అన్నట్టుగానే మరొకపక్క వాలంటరీలకు మంచి చేయాలని కోరడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది అంటూ  పలువురు నేతలు కామెంట్లు చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ వాలంటరీలను చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: