కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సంపద సృష్టించే అన్ని పనులు చేస్తామంటు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోడ్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు PPP అనే పద్ధతిని ఫాలో అవుతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనే పద్ధతితో చేస్తున్నారు. ఇది సరైనదేనా అనే ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది. అయితే ఇది నిర్వహణ కోసం మంచిదే.. ఒక రైల్వే స్టేషన్ ఒక బస్టాండ్ పారిశుద్ధ కార్మికులను పెట్టుకొని పనిచేస్తే.. ఎక్కడ కంపు అక్కడే ఉంది.. అదే ఒక ఔట్సోర్సింగ్ వాళ్లకు ఇస్తే చక్కగా పనిచేసేవారట. అది అవుట్సోర్సింగ్ బాగుంటుంది.


కానీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత  ఏమయ్యింది.. ఈ రోజున టాయిలెట్ కి వెళ్ళాలంటే బస్టాండ్లలో ఐదు రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు.గతంలో కేవలం రూపాయి చొప్పున తీసుకుంటూ ఉండేవారు.. ఇలా క్రమంగా ఏమయిందంటే.. చివరికి ఏమైందంటే బస్టాండ్ దగ్గర డబ్బులు లేని వారు చెట్ల దగ్గర, ఆగి ఉన్న బస్సులచోటనే మనం మూత్రం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు PPP కి ఇచ్చేస్తోందట.


అప్పుడు ఏమవుతుందంటే.. ప్రభుత్వం మెడికల్ కాలేజీలలో చదివినప్పుడు ఉండేటువంటి స్వేచ్ఛ.. అప్పుడు ఉన్నటువంటి కమిట్మెంట్లు .. నన్ను ప్రభుత్వం పోషించింది అని తక్కువ ఫీజులతోనే చదివించింది అన్న కమిట్మెంట్ ఉండదు.. కానీ గతంలో నాడి చూసి రోగం చెప్పేవారు ఉన్నారు... కానీ ఇప్పుడు కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత.. నీకు 100 టెస్టులు చేస్తే కానీ ఏదో ఒక జబ్బు ఉన్నట్టు గుర్తించడం కష్టంగా మారింది. వందమందిలు రాస్తే కానీ తగ్గించడం కుదరదు. ఇప్పుడు అలాంటిది PPP కే వెళితే మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.


ఇక రోడ్ల విషయానికి వస్తే హైవేల పైన గుంతలు ఉండడం వల్ల గంటలసేపు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.. ఇప్పుడు రాష్ట్ర రహదారులకు ఆర్ఎంపీ రోడ్డులట. దానికి అయ్యే ఖర్చు కూడా భరించేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటూ కారణం చెబుతూ.. ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. దీంతో ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పేస్తున్నారు. దీంతో ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారట. మొదట ట్రాక్టర్ కుండదు, టూ వీలర్ కు ఉండదు, రిక్షాకు ఉండదు, ఆటో కి ఉండదు అనేలా.. ఉండొచ్చు.. ఇక తర్వాత నెమ్మదిగా అన్ని పెంచేస్తారు. ఒకపక్క హైవే టోల్ గేట్లు మరొకపక్క గ్రౌండ్ లెవెల్ లో టోల్ గేట్లు కూడా నిర్వహించబోతున్నారట. ప్రజలు కడతారనే విషయాన్ని గుర్తించిన చంద్రబాబు ఈ పద్ధతిని తీసుకొస్తున్నారట .రోడ్డు బాగుందని సంతోషపడతారు టోల్ గేట్ల గురించి ఎవరూ బాధపడరని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తాందట. అయితే ఇదంతా కూడా ప్రజల మీదే భారం అయినప్పటికీ.. ప్రైవేటీకరణ భారం అన్నట్టుగా చూపించబోతున్నారట. ఇదే చంద్రబాబు గారి స్టైల్.

మరింత సమాచారం తెలుసుకోండి: