సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవములో తీవ్ర విషాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ఏకంగా ఏడు మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇక సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం ప్రమాద సంఘటనపై వెంటనే అలర్ట్ అయింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసింది. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించింది చంద్రబాబు నాయుడు సర్కార్.

 ఇక లేటెస్ట్ గా సింహాద్రి  అప్పన్న స్వామి చందనోత్సవ ప్రమాద సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ఏకంగా 25 లక్షల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. దీనిపై మంత్రులు అలాగే ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.

 మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు అలాగే గాయపడిన మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. అటు ఈ సంఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ హోం మంత్రి అనిత కూడా స్పందించారు. కాగా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్  కోసం క్యూ కట్టారు భక్తులు. ఈ నేపథ్యంలోనే గోడ కూలి ఏకంగా ఏడుగురు మంది ప్రయాణికులు మరణించారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: