
ఈ ఘటనలో మసూద్ మృతి చెంది ఉంటే మాత్రం ఉగ్ర సంస్థలకు చావుదెబ్బే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు ఈ ఘటనలో మృతి చెందారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య అణు యుద్ధమే అని ఐదేళ్ల క్రితం పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.
దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత సివిల్ డిఫెన్స్ డ్రిల్ కు మన దేశ భద్రతా బలగాలు సిద్ధమయ్యాయి. రాట్ లెడ్జ్ అనే పరిశోధన సంస్థ 2025లో భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుందని ఆ నివేదిక చెబుతుండటం గమనార్హం. యుద్ధం వస్తే పాకిస్తాన్ అణు బాంబు వేస్తుందని ఆ పత్రాల్లో పేర్కొనడం కొసమెరుపు. ఆపరేషన్ సింధూర్ వల్ల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలడం హాట్ టాపిక్ అవుతోంది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికే కొన్ని యుద్ధాలు జరిగాయి. ప్రతిసారి పాకిస్తాన్ కు పరాభవం ఎదురవుతూనే ఉంది. పాకిస్తాన్ చావుకు తెగించి అణు యుద్ధం మొదలు పెట్టే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ పత్రాలు పూర్తిస్థాయిలో ఎంతమేరకు నిజమవుతాయో ఎవరూ చెప్పలేరు. పాకిస్తన్ తగ్గని పక్షంలో రాబోయే రోజుల్లో ఆ దేశానికి మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు