భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త‌త లు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పాకిస్థాన్ దుశ్చర్యలను భారత సమర్థవంతంగా ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ వస్తుంది. యుద్ధంలో ఇప్పటికే అయితే పాకిస్తాన్ పై భారత్ పై చేయి సాధించింది అని చెప్పాలి. సరిహద్దుల్లో పరిస్థితులు ఉధృతంగా మారుతున్నాయి. నియంత్రణ రేఖకు అవతల వైపు పాకిస్తానీ పోస్టుల నుంచి శత్రు సైన్యం డ్రోన్ ప్రయోగిస్తోంది. అయితే వీటిని భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉంటే ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులు మూసివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో తీవ్రమైన ఇంధనం కొరత ఏర్పడింది. ఇప్పటికే కిరోసిన్ కొరత కూడా వేధిస్తుండడంతో పాక్ ప్రజలు అల్లాడుతున్నారు. చివరకు పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారయింది అంటే సరిహద్దుల్లో ఉన్న శత్రువులకు సైతం సరిగా ఆహార పదార్థాలు సరఫరా చేయలేని పరిస్థితి వచ్చేసింది.


అలాగే సరిహద్దు ల్లో ఉన్న సైన్యానికి కావలసిన కిరోసన్ కూడా ఇవ్వట్లేదని అక్కడ సైనికులు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది పాక్ ఆర్మీ ఇప్పుడున్న ప‌రిస్థితు ల్లో భార‌త్ తో యుద్ధం చేయ‌డానికి ఆస‌క్తి కూడా చూప‌డం లేద‌ట‌. భార‌త్ లో పౌర విమానాలే ల‌క్ష్యం గా పాక్ డ్రోన్లు దాడులు చేస్తోన్న నేప‌థ్యం లో పాకిస్తాన్ గ‌గ‌న త‌లం మూసి వేయాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి . .

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: