
అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా డిఎంకే పార్టీ నుంచి రాజ్యసభకు కమలహాసన్ ని పంపించబోతున్నట్లు తెలుస్తోంది.. గత ఏడాది ఎన్నికలలో తమ పార్టీతో పొత్తు పెట్టుకున్న కమలహాసన్ కు రాజ్యసభ సీటు ఇచ్చే విధంగా డీఎంకే పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అటు రాజకీయాలలో ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారుతున్నది. అంతేకాకుండా అప్పుడప్పుడు డీఎంకే అధినేత స్టాలిన్ తో కూడా కమలహాసన్ కలుస్తూ ఉన్నారు. గతంలో తాను పార్టీ స్థాపించినప్పుడు కూడా కమలహాసన్ అవినీతి రహిత పాలన, ప్రజా సమస్యలపైనే పోరాడుతానంటూ తన పార్టీ అజెండా కూడా అదేనంటూ తెలిపారు.
మరి కమలహాసన్ రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అభిమానులు భావిస్తున్నారు.. మరి రాజ్యసభ సీటుతో ఆయన ఎలా రాణిస్తారు తమిళనాడు ప్రజల సమస్యలను సైతం ఏ విధంగా పరిష్కారం చేస్తారు చూడాలి మరి. వచ్చే నెలలో కమలహాసన్ రాజ్యసభ సీట్లు లోకి డీఎంకే పార్టీ నుంచి వెళ్లబోతున్నట్లు సమాచారం. రాజ్యసభ అభ్యర్థులను కూడా వచ్చే నెలలోనే ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాలను వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే కమలహాసన్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు థగ్ లైఫ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళం నుండి కన్నడ పుట్టింది అని వివాదం సృష్టించారు. దీంతో బిజెపి నాయకులు కూడా కమలహాసన్ పై విమర్శలు గుప్పిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈయనకు రాజ్యసభ సీటు ప్రకటించడం పై తమిళ్ రాజకీయాలలో వేడి పెరిగింది