- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

రీసెంట్ గా తెలుగు చిత్ర పరిశ్రమ కు సంబంధించి కొన్ని ఆసక్తికర పరిస్థితిలు నెలకొన్న విషయం తెలిసిందే .. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్ కి అన్ని రకాల ప్రోత్సాహలిస్తూ సహకారం అందిస్తున్న అప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఆ నలుగురు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయం , సహకారం అందుకుంటున్నారు కానీ అందుకు తగ్గట్టు గా  ప్రభుత్వానికి సరైన తోడ్బాటు ఇవ్వటం లేదు అంటూ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక్కసారి గా షాకింగ్ గా మారింది .. అదే విధంగా టాలీవుడ్ పెద్దలు కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని ఇప్పటికీ కలిసింది లేదు అని వారి పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .

 అయితే ఇప్పుడు ఫైనల్ గా టాలీవుడ్ పెద్దలు మొత్తం ఈ ఆదివారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని సాయంత్రం నాలుగు గంటల సమయం లో భేటీ అయ్యి కీలక అంశాలు చర్చించబోతున్నట్టు గా వార్తలు వస్తున్నాయి .. అయితే ఇప్పుడు ఈ మీటింగ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యం లో ఉంటుందా .. ఇక మరి ఎవరెవరు భేటీ అవుతారు అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది .. అయితే ప్రధానంగా చంద్రబాబుతో భేటీ వెనక టాలీవుడ్ లో గట్టి లాబీయింగ్ జరిగిందని అంటున్నారు ..ఇదే క్రమంలో సీఎంతో భేటీ అయ్యే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ ఈ భేటీకి దూరంగా ఉండబోతున్నారని అంటున్నారు .. ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ కు జరుగుతున్న రచ్చ ఈ భేటీతో పులిస్టాప్ పడుతుందని కూడా అంటున్నారు .. ఇక మరి చంద్రబాబుతో బెట్టి తర్వాత టాలీవుడ్ పెద్దల్లో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: