స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో రాష్ట్ర క్యాబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయం పై ఎవర్ని సంప్రదించకుండా ముందుగా ఎందుకు మాట్లాడారని తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు .. తెలంగాణ మంత్రులు సీతక్క , పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో జరిగిన ఓ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోపు వస్తుంది అంటూ ప్రకటనలు ఇచ్చేసారు .. అయితే ఇందులో ముందుగా మంత్రి సీతక్క చేసిన ప్రకటన మీడియాలో వైరల్ గా మారింది .. ఆమె అప్పటికే దానిపై వివరణ ఇచ్చారు .. ప్రధానంగా తను పాలన తేదీల్లోపు వస్తుందని చెప్పలేదని ఎన్నికలకు మాత్రమే సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చానని చెప్పుకొచ్చారు.

ఇక‌ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఇలాంటి ప్రకటనే మరోసారి చేశారు .. ఇక దాంతో మహేష్ కుమార్ గౌడ్ కు తీవ్ర కోపం వచ్చింది .. క్యాబినెట్ సమావేశం జరగకముందే స్థానిక సంస్థల ఎన్నికల తేదీని ప్రకటించడం ఏమిటని మంత్రుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .. అలాగే ఒక మంత్రి శాఖ వివరాలు మరో శాఖా మంత్రి ఏ విధంగా చెబుతారని కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు .. అలాగే మంత్రులు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి పార్టీ తో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.

అలాగే తెలంగాణ మంత్రులు తమ పరిధిలో లేని అంశా లతో పాటు సున్నితమైన అంశాలపైన సొంతంగా తీసుకుంటున్న ప్రకటనలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి .. అలాగే మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించి కాకుండా ఇతరుల శాఖలకు సంబంధించిన ప్రకటనలు చేయడం ఏమిటని పిసిసికి ఫిర్యాదులు వస్తున్నాయని దీంతో మహేష్ కుమార్ గౌడ్ ఇంతగా సీరియస్ కావాల్సి వచ్చింది .. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్లో క్యాబినెట్ సమావేశానికి ముందు సీతక్క మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నికల సన్నాదత గురించి మాట్లాడాను తప్ప ఎన్నికల తేదీ గురించి చెప్పినట్లుగా తప్పుడు ప్రచారం చేశారని కూడా ఆమె మండిపడ్డారు .. ఇక మరి త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థలకు నగర మోగనుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎలాంటి వ్యుహంతో ముందుకు వెళుతుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: