ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు  తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతున్నాయి.  జనాభాను పెంచాలని చంద్రబాబు  కోరడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  ప్రపంచ  జనాభా  దినోత్సవాన్ని పురస్కరించుకుని  చంద్రబాబు  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  20 శాతం మంది యువత పెళ్లిని వద్దని అనుకుంటున్నారని చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

సరైన ఉపాధి, తగిన ఆదాయం లేకపోవడంతో  యువ జంట పిల్లల్ని వద్దని అనుకుంటున్నారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.  కొన్ని దేశాలలో జనాభా ఎక్కువై   అద్దెకు ఇస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.  మన దేశానికి  బలమైన ఆర్ధిక వనరు జనాభానే అని ఆయన చెప్పుకొచ్చారు.  గురజాడ అప్పారావు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు   అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

గతంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే   స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే చట్టం ఉండేదని  ఆ చట్టాన్ని తాము తొలగించడమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నానని  గతంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను చులకనగా చూసేవారని ఆయన తెలిపారు.  ప్రస్తుతం ఆ ధోరణిలో మార్పు వచ్చిందని  జనాభా ఎక్కువగా ఉన్న దేశాలకు గౌరవం దక్కుతుందని   ఆయన చెప్పుకొచ్చారు.

ప్రపంచంలో ఎక్కువ జనాభా  ఉన్న దేశాలకే ప్రస్తుతం గౌరవం దక్కుతుందని చంద్రబాబు  అభిప్రాయం వ్యక్తం చేశారు.  మన  దేశ జనాభా 143  కోట్లు అని చంద్రబాబు  నాయుడు చెప్పుకొచ్చారు.  చంద్రబాబు నాయుడు   చేసిన కామెంట్ల గురించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుందో  చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: