మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దు గ్రామాల వివాదం తెరపైకి రాగా ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా ఒక సందర్భంలో సరిహద్దు గ్రామాలు తమ రాష్ట్రానివే అంటూ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ప్రకటన విషయంలో కొన్ని గ్రామాలు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొన్ని గ్రామాలు మాత్రం వ్యతిరేకిస్తుండటం కొసమెరుపు.


ఆరు గ్రామాలకు చెందిన ప్రజలు  తాము తెలంగాణలోనే కొనసాగాలని భావిస్తున్నామంటూ  కలెక్టరేట్ ఎదుట నిరసన తెలపడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  1955 - 1956 సంవత్సరంలో  ఫజల్ అలీ కమిషన్ మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య సరిహద్దులను గుర్తించింది.  1978 సంవత్సరంలో  మరోసారి హద్దులు  నిర్ణయించి కొన్ని గ్రామాలు  భౌగోళిక పరిస్థితుల వల్ల ఉమ్మడి ఏపీలో ఉంటాయని  పేర్కొన్నారు.


అయితే  మహారాష్ట్రలోనే తమను విలీనం చేయాలంటూ కొన్ని గ్రామాల ప్రజల ఉద్యమం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి 1983లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు కాగా  కమిటీ ఆ గ్రామాలు ఉమ్మడి ఏపీకి చెందినవేనని వెల్లడించింది.  అయితే ఆ తర్వాత భాషా ప్రాతిపదికన విభజించాలని  రాజురా ఎమ్మెల్యే  వామన్  రావ్ చటప్  ఆందోళనకు తెర  లేపగా  మహారాష్ట్ర సర్కార్  సైతం 1990లో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి  వివాదానికి  తెర  లేపింది.


ఈ వివాదంపై ఉమ్మడి ఏపీ  సర్కార్  రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది.  ప్రస్తుతం ఇరు రాష్ట్రాలు అక్కడ పాలనను కొనసాగిస్తున్నాయి.  ఇరు  రాష్ట్రాల పాలనలో  14 గ్రామాలు ఉన్నాయి.  అయితే ఈ విధంగా రెండు రాష్ట్రాల పాలన వల్ల  కొన్ని పథకాల అమలుకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  నేటికీ భూములకు పట్టాలు లేవని  ఏ ప్రభుత్వం భూములకు పట్టాలిస్తే  ఆ రాష్ట్రంలో కొనసాగుతామని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.  రాబోయే రోజుల్లో ఈ వివాదంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: