భారత ప్రభుత్వం ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి వివిధ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పేరుతో దేశంలో మరో కొత్త పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. 2025 ఆగస్టు 1 నుండి ఈ స్కీమ్ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా ఈ పథకం అమలు కానుందని తెలుస్తోంది.

ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 99,446 కోట్లు కేటాయించింది. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు యజమానులకు ప్రోత్సాహకాలు అందించడం ఈ స్కీమ్  యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు, ముఖ్యంగా తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే వారికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ స్కీమ్  అమలవుతోంది. ఈ పథకం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కు  ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

ఈ పథకం ద్వారా  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో తొలిసారి నమోదు చేసుకునే ఉద్యోగులు బెనిఫిట్ పొందనున్నారు.  నెలకు ₹1 లక్ష వరకు జీతం ఉన్నవారు సైతం ఈ స్కీమ్  కు అర్హత కలిగి ఉంటారు. ఈ స్కీమ్  అర్హత పొందిన ఉద్యోగులకు  గరిష్టంగా 15,000 రూపాయల వరకు  రెండు వాయిదాలలో అందించబడుతుంది.  2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 వరకు సృష్టించబడే ఉద్యోగాలకు ఇది వర్తిస్తుంది.

అదనపు ఉద్యోగులను నియమించుకునే యజమానులు ఈ పథకం బెనిఫిట్స్ పొందుతారు.  కనీసం ఆరు నెలల పాటు నిలకడగా ఉద్యోగం కల్పించిన ప్రతి అదనపు ఉద్యోగికి నెలకు ₹3,000 వరకు ప్రోత్సాహకం కంపెనీలకు లభిస్తుంది.  ఈ ప్రోత్సాహకం రెండు సంవత్సరాల వరకు వర్తిస్తుంది. ఉత్పాదక రంగంలో అదనపు ఉద్యోగాలను సృష్టించిన వారికి మూడవ మరియు నాల్గవ సంవత్సరాలకు కూడా ప్రోత్సాహకాలు లభిస్తాయి.  ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: