
విశాఖలో ఒకే పార్టీలో విభేదాలు మొదలయ్యాయా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం సాగుతోంది. విశాఖ టిడిపి ఎంపీ శ్రీ భరత్ - ఏపీ టిడిపి అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మధ్య ఒక విషయం లో విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. తన నియోజకవర్గం గాజువాకలో ఒక మాజీ ఎమ్మెల్యే అనుచరులు భూకబ్జాలకు ప్రయత్నిస్తే ఎంపీ వారికి మద్దతు ఇవ్వడం తో పల్లా శ్రీనివాస్ సీరియస్ గా ఉన్నారని సమాచారం. సదరు భూ యజమాని ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి రౌడీ గ్యాంగ్ తమ భూమిలో హల్చల్ చేసిందని చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆ గ్యాంగ్ ను విడిచి పెట్టాలని ఎంపీ ఏకంగా విశాఖ సిపి కి ఫోన్ చేయడంతో వారిని వదిలేశారు అన్నది పల్లా వర్గం ఆరోపణగా తెలుస్తోంది.
దీంతో సీరియస్ అయినా పల్లా ఎంపీగా ఉన్నవారు అరాచకం చేసే వారిని విడిచి పెట్టాలని కోరడం ఏంటని ? ఫైర్ అవుతున్నట్టు సమాచారం. పక్క నియోజకవర్గానికి చెందినవారు పార్టీ నేత అయినా తన నియోజకవర్గంలో తన అనుచరులను పంపించి హడావుడిని చేయటం ఏంటని పల్లా అంటున్నారట. ప్రశాంతంగా ఉన్న గాజువాకలో ఎలాంటి అరాచక శక్తులను ప్రోత్సహించేది లేదని అంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఎంపీ కి కూడా ఫోన్ చేశారని .. ఇలాంటి వారికి మద్దతు ఇస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారని అంటున్నారని తెలుస్తోంది. దీంతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే రాజకీయం ఇప్పుడు విశాఖలో పొలిటికల్గా హిట్ పెంచుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు