ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక కసాయి తండ్రి తన మూడేళ్ల కూతురిని కేవలం రూ .5000 రూపాయలకు అమ్మేసిన ఘటన పెను సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే బాపట్ల జిల్లాలో వేటపాలకు చెందిన మస్తాన్ అనే వ్యక్తి గురువారం రాత్రి విజయవాడ బస్టాండ్ లో అప్పుడే పరిచయమైనటువంటి ఒక మహిళ, ఒక పురుషుడికి తన కుమార్తెను అమ్మేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత తన కూతురు కనిపించడం లేదని? ఎవరో కిడ్నాప్ చేశారంటూ కూడా ఒక పెద్ద నాటకాన్ని ఆడారు ఈ కసాయి తండ్రి.


మస్తాన్ ఫిర్యాదుతో దర్యాప్తుని ప్రారంభించిన కృష్ణలంక పోలీస్ అధికారులు బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉండే సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే మస్తాన్ తన కూతురిని ఆ మహిళకి, పురుషుడికి సైతం అప్పగించినట్లుగా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అంతేకాకుండా ఆ బాలికను తీసుకొని ఆ జంట విశాఖపట్నం వైపుగా వెళుతున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాలను చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ బాలికను విశాఖపట్నం తీసుకు వెళుతున్న వారిని గుర్తించి పట్టుకోవడం జరిగింది.


పోలీసులు తక్షణమే ఈ విషయం పైన స్పందించి బాలికను రక్షించి సురక్షితంగా వెనక్కి తీసుకురావడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక తండ్రి మస్తాన్ తో పాటుగా కూతురుని కొనుగోలు చేసినటువంటి ఆ జంటను కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే డబ్బు కోసమే తన కన్న బిడ్డను అమ్మడానికి సిద్ధమైనట్లుగా తండ్రి విషయం విని చాలామంది ప్రజలు ఆ తండ్రిని విమర్శిస్తున్నారు. ఇలాంటి దారుణమైన సంఘటన సమాజంలో మరి ఎవరు చేయకుండా చర్యలు తీసుకోవాలనే విధంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేసు పై మరింత లోతుగా దర్యాప్తు చేయబోతున్నట్లు అధికారులు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఏపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: