
ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియను కలుషితం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన సందర్భంలో, బొత్స సత్యనారాయణ ప్రభుత్వంలో శాంతిభద్రతల క్షీణత, బాధ్యతారహిత పాలనపై ఫిర్యాదు చేశామని తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్టలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీపై దాడి చేసి, ఆయనను హతమార్చే ప్రయత్నం జరిగిందని, అయినప్పటికీ పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేశారని విమర్శించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయని, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీసు వ్యవస్థ టీడీపీతో కుమ్మక్కై, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాలను మార్చడం, ఒక గ్రామ ఓట్లను వేరే హ్యామ్‌లెట్‌లో పెట్టడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అగౌరవపరుస్తాయని బొత్స పేర్కొన్నారు. టీడీపీ గుండాలు పది వాహనాల్లో వచ్చి ఎమ్మెల్సీపై దాడి చేస్తే, పోలీసులు నిశ్శబ్దంగా ఉండటం దారుణమని ఆయన విమర్శించారు. బాధితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని, ఇటువంటి చర్యలు ప్రజాతిరుగుబాటుకు దారితీస్తాయని హెచ్చరించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు