తెలంగాణ..ఈ పేరు చెప్పగానే దేశవ్యాప్తంగా చాలా మందికి గుర్తుకొచ్చే లీడర్ కేసీఆర్.. చూడటానికి సన్నగా ఉన్నా కానీ ఆయన రాజకీయంలో వేసే ప్లాన్స్ ఎవరికి అంతు చిక్కవు.. అద్భుతమైన మేధస్సుతో, నాయకులను, ప్రజలను ఆకట్టుకునే వాక్చాతుర్యం కలిగిన నాయకుడు.. అంతే కాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పథకాలకు ఆజ్యం పోశారు.. ఆయన తీసుకొచ్చిన పథకాలు చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.. ఇప్పటివరకు దేశంలో రైతు భీమా అనే పథకం రైతుల కోసం ఏ ప్రభుత్వం ఏ పార్టీ తీసుకురాలేదు. కానీ కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకువచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా ఇదే ఫాలో అవుతున్నాయి. అలా 9 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా అద్భుతమైన పాలన అందించిన కేసీఆర్, 2023 ఎలక్షన్స్ లో ఓటమిపాలయ్యారు. 

మరి ఇంత చేసిన కేసీఆర్ ఓటమికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని నమ్మింది కేవలం కేసీఆర్ ని చూసి మాత్రమే.. ఆ తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి కిందిస్థాయి లీడర్లు అంతా ప్రజలకు కనెక్ట్ అవ్వకుండా ఎవరికి వారి విర్రవీగిపోయారు.. దీనివల్ల ప్రజల్లో చాలావరకు విసుగు ఏర్పడి 2023 ఎన్నికల్లో ఓడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తోంది.. ఇలా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న సమయంలో, బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కాస్త విభేదాలు ఏర్పడ్డాయి. కేసీఆర్ సొంత కూతురు అయినటువంటి కవిత బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. తన తండ్రి మంచివాడే కానీ ఇతర నాయకులంతా చెడగొడుతున్నారని మీడియా ముఖంగానే చెప్పింది.

అంతేకాకుండా బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు చాలామంది అక్రమాలు చేసి ఆ అక్రమ సంపాదనలో కేసీఆర్ ను ఇరికించాలని ఆయనకు మరక పెట్టాలని చూస్తున్నారని అన్నది. ఇంత తతంగం నడుస్తున్నా కానీ కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ ఒక్కరూ మాట్లాడలేదు. అంతే కాదు ప్రతిపక్షాలు కూడా ఏం మాట్లాడాలి ఏం చేయాలనేది కేసీఆరే డైరెక్షన్ చేసేవారు. అంతటి విజ్ఞత కలిగినటువంటి కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఏమాత్రం అధికారపక్షంపై విమర్శలు చేయడం లేదు. కేవలం రెండుసార్లు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయారు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. అంతేకాదు ప్రస్తుతం పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉన్నా కానీ సిట్రైట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.

అలాగే కూతురు పార్టీపై అన్ని విమర్శలు చేసినా కూడా కనీసం నోరు విప్పి మాట్లాడలేదు. ఇదంతా చూస్తుంటే మాత్రం కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయనకు విపరీతమైన అనారోగ్య సమస్యలు బయటకు రాకుండా చేస్తున్నాయట. ఇదంతా చూస్తుంటే ఆయన పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదే జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీని అంతగా లీడ్ చేసే నాయకుడు కూడా లేడని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి చూడాలి కేసీఆర్ నిజంగానే పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెబుతారా లేదంటే సైలెంట్ గా ఉండి సింహంలా బరిలోకి దిగుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: