ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఆ పార్టీ అధినాయకుడికి అనేక సవాళ్లు ఉంటాయి. క్యాబినెట్ కూర్పు చేసి, పాలన చూసుకోవాలి.  ఈ సమయంలో వాళ్లకు లెక్కకు మించినటువంటి తలనొప్పులు ఉంటాయి. ఒక పదవి ఒకరికి వరిస్తుంది అంటే దానికి సంబంధించి ఇంకో నలుగురు అలకభూనుతారు. వారందరినీ ఒప్పించాలి. ఒక నామినేటెడ్ పదవి ఒకరికి వచ్చింది అంటే ఆ పదవి కోసం ఆశించి భంగపడిన వారు ఎంతో మంది ఉంటారు. అలా  కొంతమందికి వచ్చిన పదవులను తిరస్కరించే వారుంటారు. ఇప్పుడు అలాంటి చిక్కే తెలుగుదేశం పార్టీకి వచ్చింది. వచ్చినటువంటి కొన్ని నామినేటెడ్ పదవులను కొంతమంది నాయకులు వద్దంటున్నారు. కొంతమంది నాయకులకు పదవులు కావాలన్నా దొరకడం లేదు. ప్రస్తుతం అలాంటి వ్యవహారం చంద్రబాబు నాయుడుకు చుట్టుకుందని చెప్పవచ్చు. 

అయితే తాజాగా టీడీపీలో జరిగిన ఈ పరిణామం చూస్తే  తెలుగుదేశం పార్టీలో అలకలు మొదలయ్యాయని అర్థమవుతుంది. కానీ ఇలాంటి పరిస్థితులు జాతీయ పార్టీలో ఉండవు. ఏదైనా పదవి ఇవ్వాలంటే బూత్ స్థాయి నుంచి, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి చేరి అక్కడ ఓకే అయితేనే పదవులు వస్తాయి. కానీ ప్రాంతీయ పార్టీలో ఇలాంటివేవీ ఉండవు. ఒకసారి మంత్రి పదవి వచ్చిన వ్యక్తి, ఆ తర్వాత మాజీ మంత్రి అవుతూ ఉంటారు. ఆయనకు పదవి ఉన్నప్పుడు వారి వద్ద పనిచేసిన అనుచరులు ఒక్కోసారి మంత్రులు అయ్యే అవకాశాలుంటాయి. ఈ విధంగా ఏపీలో యనమల రామకృష్ణ, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్ పరిస్థితి ఇలాగే తయారైంది. వీళ్లే కాకుండా అనేకమంది సీనియర్లు మంత్రులుగా చేసి, మాజీ మంత్రులుగా మిగిలిపోయారు. ఈ క్రమంలోనే వాళ్ల దగ్గర పనిచేసిన వారే మంత్రులు అయితే, వాళ్ల పక్కన వీళ్లు వెళ్లి నిల్చొవలసి వస్తుంది..

తాజాగా పాలకొల్లుకు సంబంధించి రామ్మోహన్ కి  నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆయన ఇంతకుముందు ఎమ్మెల్సీగా  ప్రభుత్వ విప్ గా పని చేశారు. అలాంటి ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడంతో ఆయన ఆ పదవి వద్దని డైరెక్టుగా చంద్రబాబుకే లేఖ రాశారట. ఈ విధంగా  పెద్ద పదవులు అలంకరించిన వారు చిన్న చిన్న బోర్డు, నామినేటెడ్ పదవులను వద్దని చంద్రబాబుకు లేఖలు రాస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో అలకలు మొదలయ్యాయని సమాచారం. అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు సమాచారం. అయితే ప్రాంతీయ పార్టీలలో మనకు ఏ పదవి అందిస్తే అది తీసుకొని సైలెంట్ గా ఉండడమే మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: