తమిళనాడు రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. తమిళనాడు సంస్కృతి సంప్రదాయానికి తగ్గట్టుగానే అక్కడి రాజకీయ పార్టీలు నాయకులు కూడా నడుచుకుంటారు. సంస్కృతికి ఏదైనా నష్టం వాటిల్లుతుంది అంటే తప్పకుండా వారి ఎదురు తిరుగుతారు.. ఆ విధంగా తమిళనాడులో ఎప్పుడైనా సరే డీఎంకే,  ఏఐఏడీఎంకే పార్టీల మధ్య విపరీతమైనటువంటి పోటీ ఉండేది. గత కొన్ని సంవత్సరాల నుంచి బిజెపి కూడా ఆ పోటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా నడుస్తున్న తరుణంలోని తాజాగా మరో పార్టీ వచ్చి చేరింది. అదే తమిళనాడులో పెట్టినటువంటి తమిళ వెట్రీ కళగం పార్టీ.సినీ నటుడు విజయ్ ఈ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాలను మార్చే దిశగా ముందుకు వెళ్తోంది. ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో విజయ్ తన మానియా చూపించబోతున్నారు.

 అద్భుతమైన ఆలోచన తీరుతో ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని సకల విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.. అలాంటి విజయ్ తాజాగా తాను బీజేపీ, డిఎంకే లతో పొత్తు పెట్టుకోనని కుండబద్దలు కొట్టారు. తనకు రాజకీయ శత్రువు డీఎంకే ఉంటుందని, సైద్ధాంతిక పరంగా శత్రువు భారతీయ జనతా పార్టీ ఉండబోతుందని చెప్పేశారు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా నేను ముందుకు వెళ్తున్నానని తప్పకుండా ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తానని బలంగా చెబుతున్నారు. ఈ విధంగా విజయ్ తన సినీ ఫ్యాన్స్ ను, ఇతర వర్గాల వారిని దగ్గర చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. ఈ విధంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటును కూడగట్టేందుకు ఆయన  వ్యూహాలు రచిస్తున్నారు.

ముఖ్యంగా తమిళ ప్రజలకు న్యాయం,సమానత్వం,తమిళ సంస్కృతి పరిరక్షణ,అవినీతి నిర్మూలన, మహిళా సాధికారత వంటివాటికి పెద్దపీట వేస్తానని చెప్పుకొస్తున్నారు. అలాగే బిఆర్ అంబేద్కర్,  రాణి వేలు నాచియార్ వంటి వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నారు. ఈ విధంగా రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధిస్తానని బలంగా చెబుతున్నారు. ఇప్పటికే తన పర్యటన ఏ విధంగా ఉండబోతుందో రూట్ మ్యాప్ బయట పెట్టేశారు. అయితే ఈ నేపథ్యంలోనే బిజెపి, డీఎంకే పార్టీలు మినహా ఇతర పార్టీల తో పొత్తు పెట్టుకోవడానికి విజయ్ ఆసక్తిగానే ఉన్నారు. అలాగే విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక కొంతమంది ఆయన పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నారు.

వారిలో దివంగత నటుడు రాజకీయ నాయకుడు అయినటువంటి కెప్టెన్ విజయ్ కాంత్  స్థాపించిన డిఎండికే పార్టీ బాధ్యతలను కొనసాగిస్తున్న విజయ్ కాంత్ భార్య ప్రేమలత విజయ్ కి మద్దతుగా మాట్లాడుతోంది. కాబట్టి టీవీకె పార్టీతో డిఎండికే కలిసిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే రీసెంట్ గా ఎన్డీఏ కూటమి నుండి బయటికి వచ్చేసిన ఏఎంఏకె పార్టీ అధినేత టీటీవి దినకరన్ కూడా విజయ్ తో కలిసి నడుస్తారని తెలుస్తోంది. అలాగే అన్నాడీఎంకే పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా విజయ్ వెంట నడుస్తారని సమాచారం.మరి ఈ నేతలందరినీ కలుపుకొని విజయ్ టీవీకే పార్టీ బలమైన పోటీదారుగా నిలబడుతుందా.. డీఎంకే, బీజేపీ పార్టీలను  విజయ్ ఢీ కొడతారా.. లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: