ప్రస్తుత కాలంలో చాలావరకు పత్రికలు రాజకీయ నాయకుల పుత్రికలుగా మారిపోయాయి.. ఉన్నది ఉన్నట్టు చెబుతూ రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య వారధిగా ఉండేదే మీడియా..అలాంటి మీడియాపై ఈమధ్య ప్రజలకు కూడా విశ్వసనీయత సన్నగిల్లుతోంది. దీనికి కారణం వీరు కూడా పార్టీలకు సపోర్టు చేస్తూ వార్తలు వేయడమే.. ఇలా మీడియా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మీడియా సంస్థలు జగన్ గురించి ప్రతిరోజు ఏదో ఒక నెగిటివ్ వార్త రాస్తూ వచ్చేవారు.. అంటే ఆయన చేసిన అప్పుల గురించి మొదటి పేజీలో ప్రత్యేక హెడ్డింగ్ పెట్టి మరీ చూపించేవారు. మరి జగన్ ఉన్నప్పుడే అంతగా అప్పులు చేశారా చంద్రబాబు హయాంలో అప్పులు ఏమి చేయడం లేదా అనే విషయానికి వస్తే మాత్రం, దీని గురించి పెద్దగా మీడియా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు.

 అసలు చంద్రబాబు హయాంలో అప్పే లేదన్నట్టుగా దాస్తూ రాస్తున్నారు.. కానీ తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం చంద్రబాబు వచ్చిన కొన్ని నెలల్లోనే ఎంత అప్పు చేశారనేది బయటకు వచ్చింది.. ఆ అప్పు ఎంత.. ఆ వివరాలు  ఎంటో చూద్దాం.. గత జగన్ ప్రభుత్వంలో ఆయన చేసిన అప్పుల గురించి చైతన్య, నారాయణ ర్యాంకులు ఏ విధంగా చెబుతారో పేపర్లలో కూడా ఆ విధంగానే రాసేవారు మీడియాలో అలా చెప్పేవారు. అంతే కాదు కొంతమంది మేధావులతో డిబేట్లు కూడా పెట్టించి అప్పు అప్పు అప్పు అంటూ ఆయన రాష్ట్రాన్ని నాశనం చేసినట్టు చూపించేవారు. ఈ విధంగా ప్రజలకు ఆయన చేసే అప్పుల గురించి పూర్తిగా అర్థమయ్యేలా చూపించేవారు. జగన్ హయాంలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చారని తెలియజేశారు.

కానీ ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ వారు 10 లక్షల కోట్లు అంటూ విష ప్రచారం చేసేవారు. ఇందులో నాలుగున్నర లక్షల కోట్లు తేడా చూపించేవారు. ఈ ఏడున్నర లక్షల్లో కూడా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన అప్పు. అప్పటికి చంద్రబాబు మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారు. మొత్తం ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఉంటే దాన్ని 10 లక్షల కోట్లకు పైగా చూపించి పదేపదే జనాల్లోకి ఈ మెసేజ్ వెళ్లేలా చేసేవారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కట్ చేస్తే ఈ ఐదు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అయిన అప్పు గురించి తాజాగా కాగ్ నివేదిక బయట పెట్టింది. దాని ప్రకారం ఆగస్టు వరకు రాష్ట్రానికి ఒక లక్ష 17 వేల కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు చేసిందని కాగ్ తెలియజేసింది.

ఆగస్టు వరకు రాష్ట్రానికి సమకూరిన నిధుల విషయానికి వస్తే.. 61,578 కోట్లు రెవెన్యూ రాబడి, ఇదే సమయంలో 55,932 కోట్ల అప్పు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ రెండు కలిపి 1,17,511 కోట్ల రాష్ట్రానికి సమకూరాలని కాగ్ తెలియజేసింది. అయితే ఈ వార్తను  కొన్ని పత్రికలు ప్రచురించాయి. కానీ ఏదో చివరి పేజీల్లో చిన్న బిట్ గా మాత్రమే వేసాయి. జగన్ హయాంలో అయితే అప్పు గురించి ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ గా పెట్టిన ఈ వార్తా సంస్థలు ఇప్పుడేమో చివరి పేజీలో, కనీసం ఎవరు కూడా చూడకుండా  రాయడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఆలోచించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: