తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది.. అంతేకాదు  కొత్త రాష్ట్రం అయినా కానీ అభివృద్ధిలో ఎంతో దూసుకుపోయింది. కానీ ఎంత డెవలప్ అయిందో రాష్ట్రంలో అంత అప్పు కూడా అయింది.. అప్పులు భారీగా పెరగడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఏ పథకాన్ని కూడా అంతగా ఇంప్లిమెంట్ చేయలేకపోతోంది. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అన్నట్టు రాష్ట్ర పరిస్థితి తయారయ్యింది. అలాంటి ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ద్రవ్యోల్బణ రేటు కూడా మైనస్ లోకి పడిపోయిందని తాజాగా కొన్ని సర్వేలు బయటపెట్టాయి. మరి ఎంత మైనస్ లోకి వచ్చింది అనే వివరాలు చూద్దాం.. రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణ బలం తగ్గితే ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గుతుంది. అలాంటి ద్రవ్యోల్బణ రేటు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మైనస్ లోకి వెళ్ళింది. 

సెప్టెంబర్ లో జాతీయస్థాయిలో చూసుకుంటే ద్రవ్యోల్బణ రేటు సగటున 1.54% నమోదవ్వగా..తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి -0.15%కి పరిమితమైంది. దేశం మొత్తం చూసుకుంటే నాలుగు రాష్ట్రాల్లో మైనస్ లోకి ద్రవ్యోల్బణ రేటు వెళ్ళిపోయింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్  -0.61%, అస్సాం రాష్ట్రంలో -0.56%, బీహార్ రాష్ట్రంలో -0.51% ద్రవ్యోల్బణ రేట్లు ఉన్నాయి.. అయితే తెలంగాణ మొదటి ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో మూడు నెలలు  ప్లస్ లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణ రేటు మరో మూడు నెలలు వచ్చేసరికి మైనస్ లోకి వెళ్ళిపోయింది. గత జూన్ లో (-0.93%, జూలైలో  -0.44% నమోదైనటువంటి ద్రవయోల్బణం ఆగస్టు వచ్చేసరికి  0.94% ప్లస్ లోకి చేరుకుంది.

 మళ్లీ సెప్టెంబర్ లో మైనస్ లోకి వచ్చిందని పలు సర్వే సంస్థలు తెలియజేశాయి. ఇక 2024 సంవత్సరంలో 5.49 శాతంగా ఉన్నటువంటి ద్రవ్యోల్బణ రేటు  2025 వచ్చేసరికి 1.54 శాతానికి పడిపోయింది. ఈ క్రమంలోనే ఆహార ద్రవ్యోల్బన రేటు కూడా 9.24% నుంచి -2.28% తగ్గిపోయింది. దీనిలో భాగంగానే పప్పు దినుసులు,పండ్లు, కూరగాయలు, వంట నూనెలు, చిరుధాన్యాలు, గుడ్ల రేట్లు పడిపోవడమే కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ద్రవ్యోల్బణం  రేటు మైనస్ లోకి పడిపోవడం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా దారుణంగా తగ్గిపోతుంది. ఇక ద్రవ్యోల్బణ రేటు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో జమ్ము కాశ్మీర్,కర్నాటక, కేరళ,తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లు  నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: