బీహార్లో మొదటి దశ ఎన్నికలలో 64.66% శాతం ఓటింగ్ నమోదు కాగా ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన పోలింగ్ కూడా ఇదే. అంతకుముందు 2000 సంవత్సరంలో 62.57% మాత్రమే అత్యధికంగా నమోదయిందట. అలాగే 1998లో లోక్సభ ఎన్నికలలో 64.6 % మాత్రమే నమోదు అయ్యింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఈ మార్కు మాత్రం ఇప్పటివరకు అందుకోలేదు. కానీ ఈసారి పెద్ద ఎత్తున ప్రజలు భారీగా తరలివచ్చి మరి ఓట్లు వేయడంతో అక్కడ ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు సీఈసీ జ్ఞానేశ్ కుమార్.
ముఖ్యంగా ఎన్నికలలో ఓటింగ్ పెరగడానికి ముఖ్య కారణం అధికార ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత ఉంటేనే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గడిచిన మూడు ఎన్నికలలో కూడా బీహార్లో ఇలాంటి పరిస్థితి కనిపించింది. 2010లో బీజేపీతో కలిసి నితీష్ కుమార్ గెలిచారు. అప్పుడు ఓటింగ్ 52.73%, 2020లో మళ్లీ బిజెపి పార్టీతో జత కట్టిన నితీష్ 57.29% జరిగింది, అయితే ఈసారి మాత్రం 64.66% ఓటింగ్ జరిగింది అంటే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందనే విధంగా విశ్లేషకులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే మాత్రం 2020 ఎన్నికలలో 75 సీట్లతో నెగ్గిన ఆర్జెడి పార్టీ ఈసారి మరికొన్ని సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుందట .
ఓటింగ్ శాతం పెరగడానికి ఈ రాష్ట్రంలో ఈసీ అధికారులు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సర్వే అని మరో కారణం వినిపిస్తోంది.. బీహార్ రాష్ట్రంలో 47 లక్షల ఓట్లు తొలగించారని గతంలో 7.89 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 7.42 కోట్లకు చేరిందని దీంతో 47 ఓట్లు తగ్గడం వల్లే ఓటింగ్ శాతం పెరిగి ఉండవచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి