తెలుగుదేశం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకంగా మారబోతోంది. ఇక్కడ తెలుగుదేశం జనసేనకి సంబంధించిన ఓటర్లు చాలామందే ఉన్నారు. మరి వీరు ఎవరికి మద్దతు ఇస్తారనేది క్వశ్చన్ మార్క్ గా మారింది.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే సెటిలర్స్ ఉంటారు. అక్కడ ముఖ్యంగా టీడీపీ అభిమానులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇప్పటికి వీరు టిడిపి నాయకులు ఏది చెబితే దానికి సంబంధించిన పార్టీ కి ఓట్లు వేస్తూ ఉంటారు. అలాంటి ఈ సమయంలో అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. మరి వీరిలో ఎవరికి టిడిపి జనసేన వాళ్లు సపోర్ట్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.. అయితే బిజెపి, టిడిపి, జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

 ఇదే సమయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పొత్తులో భాగంగా  బిజెపికి సపోర్ట్ దొరుకుతుందని చెప్పుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి టిడిపి నాయకులందరినీ  సమన్వయ పరచుకున్నారని, ఎందుకంటే ఆయన టిడిపిలో ఉన్నప్పుడు వీరంతా రేవంత్ రెడ్డికి దగ్గరి పరిచయస్తులని తెలుస్తోంది. ఆ విధంగా ఆయన చక్రం తిప్పి టిడిపి జనసేన సంబంధించిన ఓట్లన్నీ కాంగ్రెస్ కి పడేలా చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే తరుణంలో గత రెండు పర్యాయాలు టిడిపి కి సంబంధించిన ఓట్లన్నీ మాగంటి గోపీనాథ్ కి పడ్డాయి.

ఈసారి ఆయన మరణించడంతో ఆయన భార్య సునీత బరిలో ఉంది. మరి టిడిపి శ్రేణులు ఆమెకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విధంగా టిడిపి పార్టీ ఓట్లను మూడు పార్టీలు మాకు పడతాయంటే మాకు పడతాయని ఆలోచనలో ఉన్నారు. మరి చూడాలి టిడిపి అభిమానులంతా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది వారి మనసులో మాత్రమే  ఉంటుంది. ఇక ఏ పార్టీ గెలిచినా మేము ఆ పార్టీకే వేసామని చెప్పుకొస్తారు కాబోలు.. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ జెండా పాతబోతుంది అనేది ఒక వారంలో తెలియబోతోంది. అయితే ఇప్పటికే జనసేన మా మద్దతు బీజేపీ పార్టీకే అంటూ తెలిపిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: