తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం పార్టీ చరిత్రలో ఏనాడూ చూడని విధంగా ఉందని చెప్పాలి. క్రమశిక్షణకు పేరుగాంచిన టీడీపీ ఇప్పుడు అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలలో అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడటం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, వివాదాస్పద కార్యకలాపాల్లో చిక్కుకోవడం వంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో టీడీపీ ఇమేజ్ దెబ్బతింటోంది. చంద్రబాబు నాయుడు గతంలో కూడా కొత్త నాయకులను ప్రోత్సహించారు.
 

1995లో ఆయన పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత యువతకు, తటస్థులకు పెద్ద స్థానం ఇచ్చారు. కానీ ఆ సమయంలో పార్టీ క్రమశిక్షణ మాత్రం కఠినంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఈసారి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది తమ వ్యక్తిగత వ్యాపారాలు, లాభాలపైనే దృష్టి పెడుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో గెలిచిన తర్వాత, ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొలికపూడి శ్రీనివాసరావు నుంచి మాధవి రెడ్డి, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, నజీర్ అహ్మద్ వరకు అనేక మంది వివిధ వివాదాల్లో పేర్లు వినిపించాయి. ఈ పరిస్థితి తెలుసుకున్నా కూడా పార్టీ అధినాయకత్వం ఏ చర్యలు తీసుకోలేకపోతోంది.

 

కారణం – ప్రభుత్వం తాజాగా ఏర్పడిన దశలో ఉండటమే కాకుండా, పార్టీ బలాన్ని దెబ్బతీయాలనే భయం. కానీ ఈ సైలెన్స్ పార్టీకి ప్రమాదకరమవుతుందనే భావన పార్టీ సీనియర్లలో కనిపిస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం, మొత్తం 135 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో దాదాపు 48 మంది - అంటే 38 శాతం మంది - ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సంక్షేమ పథకాలు, పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఈ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ నిర్ణయాలను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి పార్టీ క్రమశిక్షణలో భారీ లోటును సూచిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఇది స్పష్టమైన వేకప్ కాల్ అని చెప్పాలి. యూనిటీని తిరిగి తెచ్చుకోవాలంటే చంద్రబాబు వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో పార్టీ భవిష్యత్తు మళ్లీ సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: