వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన ముద్రవేశారు. ఎంతో కష్టపడి ఓ టర్మ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో  చాలా దారుణంగా ఓడిపోయి కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి జగన్ పార్టీ ప్రస్తుతం ఒంటరి అయిపోయింది. అంటే పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఉన్నా కానీ జగన్ మాత్రం ఒంటరి అయిపోయాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ లో ఏకాకిగా పోటీ చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ లాంటి బీజేపీ నాయకుల సపోర్టుతో అధికారంలోకి వచ్చి అందరినీ కలుపుకు పోతున్నారు. 

కానీ జగన్ మాత్రం తన తల్లిని, తన చెల్లిని,ఇతర బంధువులను కూడా దూరం చేసుకొని ఒంటరి అయిపోయాడు. ఒక్కడే వస్తూ ప్రచారం చేస్తున్నాడు. కనీసం మీడియా అయినా  ఆయన కు సపోర్టు ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది. అన్ని దారులు మూసుకుపోయి జగన్ ఒంటారైపోయాడు. జగన్ తల్లి వైయస్ విజయమ్మతో గొడవ,చెల్లి  షర్మిల తో గొడవ  దీంతో జగన్ కి ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇక దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకు అన్ని అనుకూలంగా వచ్చేటట్టు ఓవైపు కొడుకును, మరోవైపు భార్యను,కోడలు, బావమరిది బాలకృష్ణను ఇతర సినీ ఇండస్ట్రీ వారిని,మీడియాను కేంద్ర ప్రభుత్వ నాయకులను దేశంలోని ఇతర పార్టీల నాయకులను ఉపయోగించుకుంటూ  ముందుకు వెళ్తున్నారు.

 వచ్చే ఎన్నికల సమయానికి జగన్ ఒంటరిగా పోరు చేస్తే, చంద్రబాబు మాత్రం ఒక దండు లాగా కదిలివచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైనా జగన్ మారి తనకు సంబంధించిన ఆప్తులను దగ్గర ఉంచుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి జగన్ తన దగ్గర వాళ్లందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తారా లేదంటే , నేను ఒక్కరినే కానీ నా చుట్టూ లక్షలాదిమంది జనాలు ఉన్నారనే ధైర్యంతో ఉంటారా అనేది రాబోవు రోజుల్లో తెలియబోతుంది. కట్ చేస్తే జగన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా విజయం సాధిస్తే మాత్రం ఆయనను భవిష్యత్తు రాజకీయాల్లో కూడా ఎవరు ఏమి చేయలేరని అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: