ఆ సూచన మేరకే దానం నాగేందర్ త్వరలోనే రాజీనామా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు అనర్హత కేసులపై గడువు మరో నాలుగు వారాలు పొడిగించడంతో… ఆ లోపు దానం తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇచ్చి, అంగీకారం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కడియం శ్రీహరి పై పరిస్థితి కొంచెం గందరగోళంలోనే! .. కడియం శ్రీహరి 2023లో పోటీ చేయలేదు. కానీ ఆయన కుమార్తె వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉండటంతో, ఆయన చేసిన ప్రచారమే ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. ఈ అంశంపై సాక్ష్యాలు బలహీనంగా ఉండడంతో, ఆయన విషయంలో కొంత సడలింపు ఇవ్వొచ్చని అంటున్నారు. అయితే కేటీఆర్ మాత్రం ఆయనను తప్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించడం వల్ల దీనిపై ఉత్కంఠ మరింత పెరిగింది.
ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సేఫ్? .. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేల విషయంలో విచారణ పూర్తయింది. స్పీకర్ తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. ఈ ఎనిమిది మందిపై ఆధారాలు బలంగా లేకపోవడం వల్ల, వారిని సురక్షితంగా వదిలే అవకాశం రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒక్క ఉపఎన్నికా? రెండు ఉపఎన్నికలా? .. దానం నాగేందర్ రాజీనామా దాదాపు ఖాయమని తెలుస్తోంది. కడియం శ్రీహరి అనర్హతకు గురవుతారా? లేక తప్పించుకుంటారా? అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. అందువల్ల తెలంగాణలో ఒక ఉపఎన్నిక మాత్రం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితులు మారుతే రెండు ఉపఎన్నికలు రావడానికీ అవకాశం ఉంది. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో భారీ సంక్షోభం తలెత్తింది. రాబోయే రోజులు రాష్ట్రంలో మరిన్ని రాజకీయ పరిణామాలకు వేదిక కానున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి