గోల్డ్ ఫ్లెక్ 10 సిగరెట్ల ప్యాకెట్ ధర రూ .170 రూపాయల నుంచి రూ .240 రూపాయల వరకు చేరింది. అంటే ఈ ప్యాకెట్ పైన సుమారుగా రూ .70 రూపాయల వరకు పెరిగింది. దీంతో ఒక్క సిగరెట్ రూ .24 రూపాయలు. గతంలో కంటే ఒక్కో సిగరెట్ పైన ఇప్పుడు రూ .7 రూపాయల వరకు పెరిగింది.
20 పీస్ క్లాసిక్ వేరియంట్ సిగరెట్ ప్యాకెట్ ధర రూ .340 రూపాయల నుంచి రూ .480 రూపాయల వరకు పెరిగింది. అంటే ప్యాకెట్ పైన సుమారుగా రూ .140 రూపాయల వరకు పెరిగింది.
సూపర్ స్టార్ వ్యాల్యూ పది సిగరెట్ల ప్యాకెట్ ధర రూ .59 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెరిగింది.
దీంతో వ్యాపారస్తులు సైతం సిగరెట్ ధరలు ఈ రేంజ్ లో పెరగడం ఇదే మొదటిసారి గతంలో రూపాయి లేదా రెండు రూపాయలు మాత్రమే పెరిగేదని కానీ ఇప్పుడు ఒక్కో సిగరెట్టు పైన ఏకంగా రూ .5 నుంచి రూ .6 రూపాయల వరకు పెంచేశారు అంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల పైన సరికొత్త జీఎస్టీని అమలులోకి తీసుకోవచ్చారు. పాన్ మసాలా పైన 40 శాతం జీఎస్టీ తో అదనంగా ఎక్స్చేంజ్ సుంకాల్ని విధించగా.. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా తమ పైన భారాన్ని తగ్గించుకునేందుకు ఆయా కంపెనీ సైతం సిగరెట్ ధరలోనే పెంచేసుకొనేలా ప్లాన్ చేసుకున్నాయి. అందుకే ఐటిసి ఇప్పటికే ఇతరులు పెంచినట్లుగా తెలుస్తోంది. బ్రాండ్ ను బట్టి ధరలను పెంచినట్లు సమాచారం.
సిగరెట్ అలవాటు ఉన్నవారు జేబులకు చిల్లులు పడేలా ధరలు పెరగడంతో మానలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి