తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో పలు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ గెలుపే లక్ష్యంగా తొలిసారి బరిలోకి దిగబోతున్నారు. మరొకవైపు అధికారాన్ని కాపాడుకునే పనిలో డిఎంకె పార్టీ చాలా కఠినంగానే శ్రమిస్తోంది. అన్నాడీఎంకే, బిజెపి కూటమి ఈసారి ఎలాగైనా తమదే అధికారం అంటూ దిమాని వ్యక్తం చేస్తోంది. ఇటువంటి తరుణంలోనే టీవీకే పార్టీ అధినేత విజయ్ ఏ నియోజకవర్గ నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.



ఈ మేరకు ఫిబ్రవరి 22న జరిగిన టీవీకే పార్టీ క్యాడర్ మీటింగ్లో నేతలు ,కార్యకర్తలు సైతం పెరంబుర్ నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో టీవీకే పార్టీకి సంబంధించిన మేనేజ్మెంట్ సెక్రటరీ అధవ్ అర్జున ఈ తీర్మానాన్ని తెలియజేశారు. అలాగే టీవీకే పార్టీ జనరల్ సెక్రెటరీ బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ.. టీవీకే పార్టీ అధినేత ఏ నియోజకవర్గంలో నిలబడాలనే విషయంపై మేము ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాము ఈ మేరకు టీవీకే పార్టీ అధినేత విజయ్ కు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.



అధిక పేదరికం ఉన్న ప్రాంతం నుంచే  తమ పార్టీ అధికార యంత్రంగా పోటీ చేయాలని తీర్మానించామని నార్త్ చెన్నై ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టే అక్కడ నుంచి టీవీకే పార్టీ అధినేత విజయ్  పోటీ చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ తెలియజేశారు. అలాగే తమ అధినేత నటించిన జననాయగాన్ చిత్రాన్ని స్తంభింప చేసిన కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఏకైక గళం విజయ్  మాత్రమే అంటూ  తెలియజేశారు. 234 నియోజకవర్గాలలో టీవీకే పార్టీ గెలుస్తుందని రాష్ట్రాన్ని విజయ్ పరిపాలిస్తారని తెలియజేస్తున్నారు టీవీకే పార్టీ నేతలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ న్యూస్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: