బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి 2014 ,2019, 2024 వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయాలను అందుకున్న బాలకృష్ణ నియోజవర్గ అభివృద్ధి పనులలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో వ్యూహకర్తగా తనదైన ముద్ర వేసుకొని ముందుకు వెళుతున్నారు బాలకృష్ణ. ఇక సీఎం చంద్రబాబు నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధం పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత వల్ల ఈసారి ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తే రెండు విధాలుగా టిడిపి పార్టీకే కలిసొస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తే నందమూరి అభిమానులను మరియు పార్టీ కార్యకర్తలను మరింత ఉత్తేజితం చేసేలా ఉంటాయి. గతంలో కూడా బాలకృష్ణకు మంత్రి పదవి వస్తుందని వినిపించాయి. కానీ అది సాధ్యపడలేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల రాబోయే ఎన్నికల వ్యూహాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తోంది. మరి అన్ని అనుకూలించి బాలకృష్ణ కు మంత్రి పదవి ఇస్తే ఏ శాఖ కేటాయిస్తారనే విషయం పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా బాలకృష్ణకు సినీ రంగానికి సంబంధించిన సాంస్కృతిక శాఖ లేదా ప్రజలతో నేరుగా సంబంధం ఉంటే మరో కీలకమైన శాఖను ఆయనకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ బాలయ్యకు మంత్రి పదవి రాబోతుందని తెలిసి అభిమానులు సంబరపడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి